కరోనా కలవరం

ABN , First Publish Date - 2022-01-23T05:32:12+05:30 IST

కరోనా కలవరం

కరోనా కలవరం

వికారాబాద్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వికారాబాద్‌ జిల్లాలో కొవిడ్‌ పాజిటివ్‌ వ్యాప్తి పెరిగింది. శనివారం జిల్లా వ్యాప్తంగా 1640 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 326 మందికి పాజిటివ్‌ వచ్చింది. తాండూరు నియోజకవర్గం పరిధిలో 506 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 139 మందికి పాజిటివ్‌ వచ్చింది.  నవాల్గలో 10, పెద్దేముల్‌లో 9, జిన్‌గుర్తి, బషీరాబాద్‌లలో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదు కాగా, వికారాబాద్‌ నియోజకవర్గం పరిధిలో 596 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 85 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. రామయ్యగూడ, సిద్దులూరు, ఏరియా ఆసుపత్రిలో 217 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 51 మందికి పాజిటివ్‌, మర్పల్లిలో 22, కోట్‌పల్లిలో 6, ధారూరులో 5, బంట్వారంలో ఒక పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పరిగి నియోజకవర్గం పరిధిలో 300 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 68 మందికి, పరిగిలో 25, దోమలో 16, కులకచర్లలో 16, పూడూరులో 11 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొడంగల్‌ నియోజకవర్గం పరిధిలో 238 మందికి పరీక్షలు చేయగా, వారిలో 34 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. 

Updated Date - 2022-01-23T05:32:12+05:30 IST