టీఎస్‌ఆర్టీసీపై కరోనా దెబ్బ.. ఇంకా కార్మికులకు అందని జీతాలు

ABN , First Publish Date - 2021-05-09T22:56:44+05:30 IST

హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ టీఎస్‌ఆర్టీసీని మరింత దెబ్బ కొట్టింది.

టీఎస్‌ఆర్టీసీపై కరోనా దెబ్బ.. ఇంకా కార్మికులకు అందని జీతాలు

హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ టీఎస్‌ఆర్టీసీని మరింత దెబ్బ కొట్టింది. గత నెలవరకు ప్రతి రోజు సంస్థ ఆదాయం రూ. 13 కోట్లు. కానీ ఇప్పుడు పట్టుమని రూ. కోటి నుంచి రెండు కోట్లు వస్తే గగనం. అది కూడా డీజిల్‌కు సరిపోని పరిస్థితి. దీంతో కార్మికులకు చెల్లించాల్సిన జీతాలపై మళ్లీ ఎఫెక్ట్ పడింది. ఈ నెల 9వ తేదీ వచ్చినా ఇంకా జీతాలు అందక కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. 


ఇప్పటికే ఈ ఏడాది సంస్థకు రూ. వెయ్యి కోట్లు నష్టం వాటిల్లగా.. గడచిన నెల రోజులుగా సంస్థ ఆదాయం జీరోకు పడిపోయింది. కరోనా కష్టకాలంలో కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి బస్సులను తిప్పుతున్నా డీజిల్ ఛార్జీలు కూడా రాని పరిస్థితి నెలకొంది. కరోనా మొదటి దశ నుంచి క్రమంగా కోలుకున్న ఆర్టీసీ ప్రతిరోజు రూ. 13 కోట్లు వసూలు చేసేది. ఈ లెక్కన నెలకు దాదాపు రూ. 4 వందల కోట్ల వరకు ఛార్జీలు, కార్గో సేవల ద్వారా సంస్థ ఆదాయాన్ని ఆర్జించింది. సంస్థలో పని చేస్తున్న 49వేల మంది కార్మికులకు ప్రతి నెల జీతాల కింద  రూ. 180 కోట్లు చెల్లించాలి. అలాగే ఇంధనం ఖర్చుల కింద రూ. 2వందల కోట్లు పోయినా.. వచ్చే ఆదాయానికి, ఇచ్చే జీతాలకు సరిపోయేది. నష్టాలను పూడ్చుకోడానికి కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్న సమయంలో కరోనా రెండోదశ మరింత నష్టాల్లోకి నెట్టింది.

Updated Date - 2021-05-09T22:56:44+05:30 IST