సంగారెడ్డి జిల్లాలో 130 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-08-07T07:07:56+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో గురువారం 130 మందికి కరోనా నిర్ధారణ అయిందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాంరాథోడ్‌ తెలిపారు.

సంగారెడ్డి జిల్లాలో 130 మందికి కరోనా

సంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 6 : సంగారెడ్డి జిల్లాలో గురువారం 130 మందికి కరోనా నిర్ధారణ అయిందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాంరాథోడ్‌ తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో-36, జహీరాబాద్‌-7, పటాన్‌చెరు-7, బీరంగూడ-5, సదాశివపేట-5, కంది-4, కించన్‌పల్లి-4, అందోల్‌-4, పోచారం-4, గిర్మాపూర్‌-2, లక్ష్మీపతిగూడెం-2, చిమ్నాపూర్‌-2, చెర్లగూడెం, భానూర్‌, చాప్టా(కె), లక్డారం, అంగడిపేట, జోగిపేట, హత్నూర, ఝరాసంగం, గుమ్మడిదల, మల్లెపల్లి, ఇస్నాపూర్‌, కోహీర్‌, నాగులపల్లి, కానుకుంట, డాకూర్‌, ఆర్‌సీపురం, చేర్యాల, అనంతసాగర్‌లో ఒక్కొక్కరికి కరోనా సోకినట్లు వెల్లడించారు.


పాజిటివ్‌ వచ్చిన 101 మందిలో 96 మంది హోంఐసోలేషన్‌లో ఉండగా, ఇద్దరు ప్రభుత్వ, ముగ్గురు ప్రైవేటు ఆస్పత్రిలో చేరారని వివరించారు. జిల్లా ఆస్పత్రి ఐసోలేషన్‌ నుంచి 218 మంది శాంపిళ్లు సేకరించి గాంధీకి పంపామని డీఎంహెచ్‌వో తెలిపారు. జిల్లాలోని 13 ఆరోగ్య కేంద్రాల నుంచి 184 మందికి ర్యాపిడ్‌ టెస్టులు చేయగా 29 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు డీఎంహెచ్‌వో తెలిపారు.


సర్పంచ్‌కు, పంచాయతీ కార్యదర్శికి.. 

కంగ్టి : కంగ్టి మండలం సాధుతండా సర్పంచ్‌కు, రాసోల్‌ గ్రామపంచాయతీ కార్యదర్శికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని కంగ్టి వైద్యాధికారి మనోహర్‌రెడ్డి తెలిపారు. 


మెదక్‌ జిల్లాలో 35 మందికి పాజిటివ్‌

మెదక్‌ అర్బన్ : మెదక్‌ జిల్లాలో గురువారం 35 మందికి కరోనా సోకింది. జిల్లావ్యాప్తంగా ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో నిర్వహించిన ర్యాపిడ్‌ టెస్టుల ద్వారా 32 మందికి కరోనా పాజిటివ్‌  నిర్ధారణ అయింది. మెదక్‌ పట్టణంలో 18, రామాయంపేట 4, నర్సాపూర్‌ 3, కౌడిపల్లి 3, తూప్రాన్‌ 2, శివ్వంపేట, అల్లాదుర్గం, నార్సింగి, చేగుంట, రెడ్డిపల్లిలో ఒకటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-08-07T07:07:56+05:30 IST