61 మందికి కరోనా

ABN , First Publish Date - 2022-01-21T06:21:38+05:30 IST

కరోనా మళ్లీ కలవర పెడు తోంది. నర్సీపట్నం, చుట్టు పక్కల గ్రామాల్లో ఈ కేసులు పెరుగుతుండడమే ఇందుకు ఉదాహణ. ప్రాంతీయ ఆస్పత్రిలో బుధవారం ఉదయం 45 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, అందులో 32 మందికి పాజిటివ్‌ అని తేలింది.

61 మందికి కరోనా

 నర్సీపట్నం, పరిసరాల్లో రెండు రోజుల్లో నిర్ధారణ

  వైరస్‌ బారిన విద్యార్థులు, ఉపాధ్యాయులు

 అంతా హోం ఐసోలేషన్‌లో చికిత్సలు

నర్సీపట్నం, జనవరి 20 : కరోనా మళ్లీ కలవర పెడు తోంది. నర్సీపట్నం, చుట్టు పక్కల గ్రామాల్లో ఈ కేసులు పెరుగుతుండడమే ఇందుకు ఉదాహణ. ప్రాంతీయ ఆస్పత్రిలో బుధవారం ఉదయం 45 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, అందులో 32 మందికి పాజిటివ్‌ అని తేలింది. అలాగే, నర్సీపట్నం ఆర్డీవో  గోవిందరావుకు కరోనా సోకినట్టు గురువారం నిర్ధారణ జరిగింది. దీంతో వీరంతా హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్సలు పొందుతున్నారు.  అలాగే, జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ఇద్దరు ఉపాధ్యాయులు, ఎరకన్నపాలెం ఎంపీపీ స్కూల్‌లో ఒక ఉపాధ్యాయుడు, పెదబొడ్డేపల్లి ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు కొవిడ్‌ బారినపడ్డారు. జడ్పీ బాలిక ఉన్నత పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులకు వైరస్‌ లక్షణాలు కనిపించడంతో కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. ఇలా పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా సోకుతుం డడంతో  దీని ప్రభావం మిగతా పిల్లలపై పడుతుందని పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు భయ పడుతు న్నారు. ఇదిలావుంటే,  గడచిన రెండు రోజుల్లో 25 మందికి పరీక్షలు చేస్తే 20 పాజిటివ్‌లు వచ్చాయని మునిసిపల్‌ అధికారులు చెప్పారు.

గొలుగొండ స్టేషన్‌లో కానిస్టేబుల్‌కు...

 గొలుగొండ : ఇక్కడి పోలీస్‌ స్టేషన్‌లో ఓ కానిస్టేబుల్‌కు కరోనా సోకినట్టు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ శ్యామ్‌ తెలిపారు. గురువారం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించిగా నిర్ధారణ జరిగినట్టు చెప్పారు. 

‘కోటవురట్ల’లో ఎంఈవోతో సహా ఐదుగురు..

కోటవురట్ల : మండలంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా గురువారం ఎంఈవో కొవిడ్‌ బారిన పడడంతో హోం ఐసోలేషన్‌లో చికిత్సలు పొందుతున్నారు. అలాగే, కొడవటిపూడి యూపీ స్కూల్‌లో ముగ్గురు ఉపాధ్యాయినులు, తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐకు వైరస్‌ సోకినట్టు నిర్ధారణ జరిగింది.  


Updated Date - 2022-01-21T06:21:38+05:30 IST