జిల్లాలో మరో 127 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-09-23T06:20:58+05:30 IST

జిల్లాలో మరో 127 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో

జిల్లాలో మరో 127 మందికి కరోనా

చికిత్స పొందుతూ ఇద్దరు మహిళల మృతి 


కరీంనగర్‌, సెప్టెంబర్‌ 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో మరో 127 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా సుమారు 300 మంది వరకు వ్యాధి బారిన పడినట్లు అనధికారిక సమాచారం. రామ డుగు మండలం దేశరాజుపల్లి గ్రామానికి చెందిన 52 సంవత్సరాల మహిళా కరోనా వ్యాధి బారినపడి కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ మృతిచెందింది. అలాగే శంకరపట్నం మండ లం కొత్తగట్టుకు చెందిన 60 సంవత్సరాల మహిళ  జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మృతిచెందింది.  చొప్పదండి మండలంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులతో ప్రజలు తీవ్రభయాందో ళనకు గురవుతున్నారు. మండలంలోని రుక్మాపూర్‌ గ్రామంలో మంగళవారం ఒక్కరోజే 31 మంది వ్యాధిబారినపడ్డారు. హుజురాబాద్‌ డివిజన్‌పరిధిలో ని జమ్మికుంట మండలంలో 21మందికి , హుజు రాబాద్‌ మండలంలో13 మందికి, శంకరపట్నం మండలంలో నలుగురికి, వీణవంకమండలంలో ఏడు గురికి , ఇల్లందకుంట మండలంలో 14మందికి, సైదాపూర్‌ మండలంలో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది.


అలాగే కరీంనగర్‌ డివిజన్‌ పరిధిలోని మానకొం డూర్‌ మండలంలో  11 మంది, తిమ్మాపూర్‌లో 16, మంది, కొత్తపల్లి మండలంలో నలుగురు, కరీంనగర్‌ రూరల్‌ మండలంలో నలుగురు, గన్నేరువరం మండ లంలో ఒకరు, గంగాధర మండలంలో  10 మంది, చిగురుమామిడిలో 13 కోవిడ్‌ వ్యాధిబారినపడ్డారు. కరీంనగర్‌ పట్టణంలోని పద్మశాలి వీధిలో ముగ్గురు, మారుతీనగర్‌లో ముగ్గురు, లక్ష్మీనగర్‌లో ఇద్దరు, కోతిరాంపూర్‌లో నలుగురు, అశోక్‌నగర్‌లో నలుగురు, హౌజింగ్‌బోర్డుకాలనీలో ఇద్దరు, శ్రీనగర్‌కాలనీలో ఇద్దరు వ్యాధిబారిన పడ్డారు. విద్యానగర్‌లో నలుగు రికి, మంకమ్మతోటలో ఒక్కరికి, నవీనకుర్మవాడలో ఒకరికి, సుభాష్‌నగర్‌లో ఆరుగురికి, ఆదర్శనగర్‌లో ఒకరికి, కిసాన్‌నగర్‌లో ఒకరికి, వావిలాలపల్లిలో ఒకరికి, అంబేద్కర్‌నగర్‌లో ఒకరికి, సప్తగిరికాలనీలో ఇద్దరికి, శ్రీనగర్‌కాలనీలో ఇద్దరికి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. గణేశ్‌నగర్‌లో రెండు, తిరుమల్‌నగర్‌లో ఒకటి, కట్టరాంపూర్‌లో రెండు, భగత్‌నగర్‌లో ఒకటి, రేకుర్తిలో మూడు, జ్యోతినగర్‌లో ఏడు, చైతన్యపురి లో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. 

Updated Date - 2020-09-23T06:20:58+05:30 IST