Advertisement

మోపాల్‌ మండలంలో ఆరుగురు ఉపాధ్యాయులకు కరోనా

Apr 22 2021 @ 23:50PM

మోపాల్‌, ఏప్రిల్‌ 22: మండలంలోని ఓ గ్రామంలో ఉన్న జడ్పీహెచ్‌ పాఠశాలలో పనిచేస్తున్న ఆరుగురు ఉపాధ్యాయులకు కరోనా రావడం తో వారు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మిగతా ఉపాధ్యాయులు పాఠశాలకు రావడానికి జంకుతున్నారు. పాఠశాల బంద్‌ ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు మాత్రం నిత్యం పాఠశాలకు రావాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాఠశాలలో శుక్రవారం నుంచి కరోనా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియడంతో ఉపాధ్యాయులు భయాందోళన చెందుతున్నారు. ఈ పాఠశాలను కరోనా సెంటర్‌గా పెట్టవద్దని పలువురు ఉపాధ్యాయులు ఉన్నతాధికారులను కోరుతున్నారు. 

Follow Us on:
Advertisement