కరోనా ఎట్‌ ది 1008

ABN , First Publish Date - 2020-07-06T10:37:35+05:30 IST

జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. కేవలం రెండు రోజుల వ్యవధిలో 127 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కరోనా ఎట్‌ ది 1008

ఆదివారం 62 పాజిటివ్‌లో

రెండో రోజుల్లో 127 కేసుల నమోదు


నెల్లూర ు (వైద్యం), జూలై 5 : జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది.   కేవలం రెండు రోజుల వ్యవధిలో 127 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 1008 చేరుకుంది. మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్‌ 14వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 56 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. మే నెల 9వ తేదీ నుంచి కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగి పోయాయి. కేవలం రెండు వారాల వ్యవధిలో 200 కేసులు దాటాయి. మే  21వ తేదీ నాటికి 201 కేసులు, జూన్‌ 6వ తేదీ నాటికి 15 రోజుల వ్యవధిలో 300 కేసులకు అధిగమించడం గమనార్హం. 13వ తేదీన ఏకంగా 400 మైలు రాయిని దాటేసింది. జూన్‌ 17వ తేదీ నాటికి 500, 24వ తేదీకి 600 కేసులు దాటింది. అలాగే మరో 4 రోజుల వ్యవధిలో అంటే జూన్‌ 28వ తేదీకి ఏకంగా 113 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 30వ తేదీ నాటికి 819 చేరగా, జూలై 4వ తేదీ నాటికి 946 చేరింది. 


తాజాగా 62 కేసులు

జిల్లాలో ఆదివారం 62 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో నెల్లూరులోనే  27 ఉన్నాయి. మూలాపేటలో 5, దర్గామిట్ట 5, హరనాథపురం లో 3, ఎన్టీఆర్‌ నగర్‌లో 2, బాలాజీనగర్‌లో 1, ధనలక్ష్మీపురంలో 1, అయ్యప్పగుడి వద్ద 1, నీలగిరిసంఘంలో 1, కల్లూరుపల్లిలో 1, వేదాయపాళెంలో 2, వెంగళరావ్‌నగర్‌లో 1, నేతాజినగర్‌లో 1, జ్యోతినగర్‌లో 1, బంగ్లాతోటలో 1, జెండావీధిలో 1, కావలిలో 6, కోవూరు మండలం పాటూరులో 3, మర్రిపాడులో 2, చిల్లకూరు మండలం తిప్పగుంటపాడులో 1, తడ మండలం మాంబట్టులో 1, సంగం మండలం కొరిమెర్లలో 1, కలువాయి మండలం దాచూరులో 1, బాలాయపల్లిలో 2, అల్లూరులో 1, గూడూరులో 1, దగదర్తి మండలం ధర్మవరంలో 1, కోట మండలం సిద్దనకండ్రిగలో 2, రాపూరు మండలం పంగిలిలో 1, వెంకటచలం మండలం కసుమూరులో 1, కొండాపురం మండలం ఇస్కదామెర్లలో 1, ఏఎ్‌సపేట మండలం దామవరం లో1, జమ్మవరం 1, కొడవలూరు మండలం ఆలూరుపాడులో 1, ఇందుకూరుపేటలో 1, బుచ్చి మండలం పెనుబల్లిలో 1, చిట్టమూరు మండలం ఏపినాపిలో 1, జీఎన్‌ దిబ్బలో 1, చిత్తూరు జిల్లా 1, ప్రకాశం జిల్లా 1, గుంటూరు వాసికి కరోనా సోకింది. 

Updated Date - 2020-07-06T10:37:35+05:30 IST