Advertisement

వ్యాక్సిన్ పంపిణీకి అమెరికా రెడీ.. ఆ ఒక్క అనుమతీ వస్తే..!

Nov 21 2020 @ 13:07PM

ఇంటర్నెట్ డెస్క్: కోట్ల మందికి సోకింది. ఇంకా వ్యాప్తి చెందుతోంది. కోటికిపైగా ప్రాణాలు బలితీసుకుంది. ఇంకా ఆకలి తీరనట్లు విజృంభిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ మహమ్మారిని నిర్మూలించేందుకు అమెరికా దాదాపుగా సంసిసస్ధమైందనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ల అభివృద్ధిని వేగవంతం చేశాయి అక్కడి వైద్య సంస్థలు. ఈ వ్యాక్సిన్లు కూడా మంచి ఫలితాలిస్తున్నట్లు ఇఫ్పటికే ఆయా కంపెనీలు ప్రకటించేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యాక్సిన్లకు ఔషధ, నియంత్రణ సంస్థ అనుమతి లభించిన వెంటనే పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటోంది. దీనికి సంబంధించి అమెరికా అధికార భవనం వైట్‌హౌస్ నుంచి ఓ కీలక ప్రకటన వెలువడింది. ఈ ఏడాది చివరికల్లా 40 మిలియన్ల డోసులు అందుబాటులోకి రానున్నాయని అందులో పేర్కొంది.


ట్రంపే కారణమట!

ఇదంతా అధ్యక్షుడు ట్రంప్‌ మార్గనిర్దేశం వల్లే సాధ్యమయిందని అధికార ప్రతినిధి కేలే మెకనీ అభిప్రాయపడ్డారు. ట్రంప్‌ ఆలోచన నుంచి పుట్టిన ‘ఆపరేషన్‌ వార్ప్‌ స్పీడ్‌’ వల్లే ఇది సాధ్యమవుతోందని వ్యాఖ్యానించారు. టీకా పంపిణీ ప్రణాళికపై ట్రంప్‌ పాలకవర్గం అలసత్వం ప్రదర్శిస్తోందన్న బైడెన్‌ బృందం ఆరోపణల్ని కొట్టిపారేశారు.

 

ఇప్పటికే అమెరికాలోని పీఫైజర్, మొడెర్నా సంస్థలు తమ వ్యాక్సిన్‌లు 90శాతానికి పైగా సామర్థ్యం కలిగి ఉన్నట్లు ప్రకటించాయి. అయితే, జులైలో పీఫైజర్ అభివృద్ధి, తయారీకి ట్రంప్‌ పాలక వర్గం 1.95 బిలియన్‌ డాలర్లు కేటాయించింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ని ప్రశంసిస్తూ మెకనీ తాజా వ్యాఖ్యలు చేశారు. జనవరి నుంచే వ్యాక్సిన్‌ అభివృద్ధిపై ట్రంప్‌ దృష్టి సారించారని తెలిపారు. వ్యాక్సిన్ అందజేయడానికి కావాల్సిన ప్రణాళికలను రెడీ చేశారన్నారు. అందులో భాగంగానే దేశంలో 64 స్థానిక పాలనా యంత్రాంగాలతో కలిసి ప్రత్యేక పంపిణీ విధానానికి రూపొందించారని తెలిపారు.

ట్రంప్ కోపం తగ్గడం లేదే..!

ట్రంప్‌ను ఒకపక్క పీఫైజర్ ఆకాశానికెత్తేస్తున్నా.. ట్రంప్‌ మాత్రం కోపంతో రగిలిపోతున్నారు. అమెరికాలోని ఔషధ తయారీ సంస్థలపై విరుచుకుపడ్డారు. తాజాగా ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో ఫార్మా కంపెనీలన్నీ ఏకమై తనపై దుష్ప్రచారం చేశాయని ఆరోపిస్తున్నారు. అందుకోసం మిలియన్ల డాలర్లు వెచ్చించారన్నారు. బడా సాంకేతిక, మీడియా సంస్థలు తనకు వ్యతిరేకంగా పనిచేశాయన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ మరోసారి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బైడెన్ కాదని, తానే గెలిచానని చెప్పుకొచ్చారు.


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.