కరోనా భయంతో ఉరివేసుకుని కాంట్రాక్టు లెక్చరర్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-07T06:26:47+05:30 IST

కరోనా సోకిందన్న భయంతో కాంట్రాక్టు లెక్చరర్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్‌ జిల్లా రూరల్‌ మండలంలో జరిగింది.

కరోనా భయంతో ఉరివేసుకుని కాంట్రాక్టు లెక్చరర్‌ ఆత్మహత్య
పోస్టుమార్టం నిర్వహిస్తున్న దృశ్యం

సోన్‌, మే 6 : కరోనా సోకిందన్న భయంతో కాంట్రాక్టు లెక్చరర్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్‌ జిల్లా రూరల్‌ మండలంలో జరిగింది. ఇన్‌చార్జి ఎస్సై సుమన్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రత్నాపూర్‌ కాండ్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టు లెక్చరర్‌(40) ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పనిచేస్తున్నాడు. అతడు గత 15 రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. అప్పటి నుంచి భయపడుతూ గురువారం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠ శాలలో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. 

కరోనాతో మృతి చెందిన వ్యక్తికి  పోస్టుమార్టం

నిర్మల్‌, మే 6 (ఆంధ్రజ్యోతి) : కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహానికి జిల్లాలోనే మొట్టమొదటి సారిగా పోస్టుమార్టం నిర్వ హించారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్‌ జిల్లా నిర్మల్‌ రూరల్‌ మండలంలోని రత్నా పూర్‌ కాండ్లి గ్రామానికి చెందిన పరుస పోశెట్టి కరోనా వచ్చిందనే భయంతో గురు వారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్ప పడ్డాడు. రూరల్‌ ఎస్సై సుమన్‌రెడ్డి ఆధ్వర్యం లో అక్కడే పంచనామా జరిపారు. కాగా నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ వేణుగోపాలకృష్ణ పోస్టుమార్టం నిర్వహిం చారు. కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృత దేహంకు పోస్టుమార్టం నిర్వహించడం ఇదే మొదటి సారి కావడం జరిగింది.

Updated Date - 2021-05-07T06:26:47+05:30 IST