కరోనా మరణమృదంగం..!

ABN , First Publish Date - 2021-05-09T06:20:30+05:30 IST

కొవిడ్‌ కన్రెర్ర చేస్తోంది. మండలంలో పాజిటివ్‌లు భారీగా పెరుగుతున్నాయి. ప్రతి గ్రామంలోనూ 10కి పైగా కేసులు నమో దవుతున్నాయి.

కరోనా మరణమృదంగం..!


బాధితుల్లో వ్యవసాయ, ఉపాధి కూలీలే అధికం 

హోంక్వారంటైన్‌కే పెరుగుతున్న ప్రాధాన్యం  

ఆందోళన కలిగిస్తున్న  మృతులు

కొండపి, మే 8 : కొవిడ్‌ కన్రెర్ర చేస్తోంది. మండలంలో పాజిటివ్‌లు భారీగా పెరుగుతున్నాయి. ప్రతి గ్రామంలోనూ 10కి పైగా కేసులు నమో దవుతున్నాయి. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. బాధితులు ఎక్కువ మంది హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వెన్నూరులో 10 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం.  కె.ఉప్పలపాడు, మిట్టపాలెం, చోడవరం గ్రామాల్లో కూడా పలువురు బాధితులు ఇళ్లలోనే ఉండి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. 

రెండు రోజుల వ్యవధిలో ఐదుగురి మృతి 

కరోనా బారిన పడి శుక్ర, శనివారాల్లో ఐదుగురు మృతి చెందారు. చినవెంకన్నపాలెం గ్రామానికి చెంది ఒంగోలులో లాయర్‌గా పని చేస్తున్న వ్యక్తి హైదరాబాద్‌లోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ శని వారం మరణించారు. కె.ఉప్పలపాడుకు చెందిన ఓ వ్యక్తి, కొండపికి చెం దిన మరో వ్యక్తి కూడా హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు బంధువుల ద్వారా తెలిసింది. అనకర్లపూడి గ్రామానికి చెందిన ఓ మహిళా ఉపాధి కూలీ శుక్రవారం మృతి చెందింది. కొండపిలోని బీసీ కాలనీకి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో ఉంటూ కరోనా పాజిటివ్‌ రావడంతో ఇక్కడికి వచ్చాడు. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. 

కూలీలే బాధితులు

కరోనా బాధితుల్లో వ్యవసాయ, ఉ పాధి కూలీలు అధికంగా ఉంటు న్నారు. మండలంలోని పలు గ్రామా ల్లో పొగాకు గ్రేడింగ్‌ పనులు, మిరప కోతలు ముమ్మరంగా సాగుతు న్నాయి. వీటితోపాటు ఉపాధి కూలి పనులు కూడా జరుగుతున్నాయి. పని ప్రదేశంలో భౌతిక దూరం పాటించక పోవడం, మాస్కులు కూడా ధరించకపో వడంతో కూలీలు కరోనా బారిన పడుతున్నారు.  

ఒక్కరోజే ముగ్గురు మృతి..

కందుకూరు : కందుకూరు మండలంలో  కరోనాతో శనివారం ఒక్కరోజే ముగ్గురు మృతిచెందారు. మున్సిపాలిటీ పరిధిలోని గనిగుంట గ్రామానికి చెందిన  యువకుడు కరోనాతో మృతిచెందాడు. గత పదిరోజులుగా  చికి త్స పొందుతున్న ఆయన మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచాడు. పట్టణ ంలోని కారు స్టాండులోని యువకుడు కరోనాతో మృతిచెందాడు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన వైద్యపరీక్షల కోసం హైద రాబాద్‌ వెళ్లగా అక్కడ కరోనా సోకటంతో మృతిచెందాడు. మండలంలోని జిల్లెలమూడి గ్రామానికి చెందిన విశ్రాంత పంచాయతీ కార్యదర్శి కరోనాతో మృతిచెందాడు. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన భార్య కూడా కరోనా బారినపడగా రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

కరోనాతో  మరొకరు

లింగసముద్రం : లింగసముద్రం గ్రామంలో కరోనాతో ఒకరు మృతి చెందారు. గ్రామానికి చెందిన ఓ మహిళ వారం రోజుల క్రితం కరోనాకు గురై ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతోంది. రెండు రోజుల నుం చి పరిస్థితి విషమించడంతో శనివారం ఆమె మృతిచెందింది. దీంతో లింగసముద్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 7కు చేరుకొంది. 

కొవిడ్‌తో వృద్ధురాలి మృతి

పెద్ద దోర్నాల : కరోనాతో గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వృద్ధురాలు(70) శనివారం మృతిచెందారు. కొద్దిరోజుల క్రితం ఆమె కర్నూలు జిల్లా సుండిపెంటలో బంఽధువుల ఇంటికి వచ్చారు. రెండు రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతుండగా, బంధువులు ఆమెను కారులో స్వగ్రామం పిడుగురాళ్లకు తీసుకువెళ్తున్నారు. ఈక్రమంలో దోర్నాల సమీపంలో అపస్మారకస్థితిలో ఉండడం గమనించారు. వెంటనే ఆమెను దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందారు. కొవిడ్‌ వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యాధికారులు తెలిపారు. మృతదేహాన్ని పిడుగురాళ్లకు తరలించారు.


Updated Date - 2021-05-09T06:20:30+05:30 IST