పల్లెల్లో కరోనా ముప్పు..!

ABN , First Publish Date - 2021-05-09T06:30:58+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ విస్తృతంగా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల పల్లెల్లో కూడా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయంతో వణుకు తున్నారు.

పల్లెల్లో కరోనా ముప్పు..!


రోజురోజుకు పెరుగుతున్న కేసులు

మాస్కులు లేకున్నా పట్టించుకునేదెవరు ?

కనిపించని భౌతికదూరం

గ్రామాల్లో ఆందోళన

గిద్దలూరు టౌన్‌, మే 8 : కరోనా సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ విస్తృతంగా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల పల్లెల్లో కూడా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయంతో  వణుకు తున్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గ్రామాల్లో కొవిడ్‌ బాధితులతో ప్రైమరీ కాంటాక్ట్‌ అయిన వ్యక్తులు కూ డా యథేచ్ఛగా తిరుగుతున్నారు. వారందరికీ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలి. కొన్ని గ్రామాలలో  కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినా ఫలితాలు రావలసి ఉంది. గ్రామాల్లో ఎక్కడా మాస్కులు పెట్టుకోవడం గాని, భౌతికదూరం పాటించడం లేదు. దీనితో కొవిడ్‌ వ్యా ప్తి పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను, కూలీలను ఎక్కించుకుని మాస్కులు లేకుండా ప్రయాణాలు సాగిస్తున్నారు. వీరిని అడిగేవారే లేరు. బైక్‌లపై యువత ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తున్నారు. దీనితో పల్లెల్లో కరోనా ముంపు పొంచియున్నదని ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో ఎక్కడా స్వీ యనియంత్రణ, భౌతికదూరం కనిపించడం లేదు. ఇప్పటికైనా ప్రజలు, వ్యాపారులు, దుకాణదారులు మాస్కులు ధరించేలా, భౌతికదూరం పాటించేలా పోలీసులు, సచివాలయ సిబ్బంది, వార్డు వలంటీర్లు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.   

వై.పాలెంలో 31 మందికి పాజిటివ్‌

ఎర్రగొండపాలెం : ఎర్రగొండపాలెం సీహెచ్‌సీలో 62 మందికి  కరోనా పరీక్షలు నిర్వహించగా 31 మందికి శనివారం పాజిటివ్‌ నిర్ధారణ అ య్యిందని డాక్టరు స్ర వంతి, డాక్టరు  శంకరనాయక్‌ తెలిపారు. వీరిలో 49 మందికి ట్రూనాట్‌  టెస్టులు చే యగా 25మందికి పా జిటివ్‌ వచ్చినట్టు తెలి పారు.  13 మందికి ఆర్టీజెన్‌ టెస్టులు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్‌లు నిర్ధారణ అయినట్లు  తెలిపారు. మరో 19 మందికి స్వా బ్‌ తీసి వీఆర్‌డీఎల్‌ టె స్టుకు ఒంగోలు ల్యా బ్‌కు పంపించినట్లు  తెలిపారు.  

నియోజకవర్గంలో 49 కరోనా కేసులు

గిద్దలూరు టౌన్‌,   : నియోజకవర్గంలో 49 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ మేరకు వైద్యులు శనివారం ప్రకటనలో తెలిపారు. గిద్దలూరులో 14, బేస్తవారపేటలో 13, రాచర్లలో 7, కంభంలో 14, అర్థవీడులో 1 కేసులు నమోదైనట్లు తెలిపారు. 



Updated Date - 2021-05-09T06:30:58+05:30 IST