Advertisement

అనంతపురంలో నలుగురు కరోనా రోగులు మృతి

May 4 2021 @ 22:14PM

అనంతపురం: క్యాన్సర్‌ ఆస్పత్రిలో కరోనా రోగులు నలుగురు మృతి చెందారు. ఆక్సిజన్‌ కొరత వల్లే చనిపోయారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం ఏడు గంటలకు ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందని చెబుతున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ చంద్రుడు, ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఆస్పత్రిలో పరిస్థితిని సమీక్షించారు. 


కాగా ఇటీవల అనంతపురం జనరల్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 10 మంది రోగుల మృతి చెందారు. అదే రోజు కర్నూలు కేఎస్‌ కే‌ర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఆరుగురు కరోనా రోగులు మృతి చెందారు. ఈ రెండు విషాదకర ఘటనలు మర్చిపోకముందే మరో ఆస్పత్రిలో పునరావృతం కావడం విమర్శలకు తావిస్తోంది. 


Follow Us on:
Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.