Advertisement

కొత్తగా 106 మందికి కరోనా పాజిటివ్‌

Sep 27 2020 @ 05:42AM

కరీంనగర్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో మరో 106 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు. గత రెండు, మూడు రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతుండడంతో వైరస్‌ ప్రభావం తగ్గుతుందని భావిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు శనివారం జిల్లాలో దాదాపు 250 మంది వరకు వ్యాధి బారిన పడ్డట్లు తెలుస్తోంది. 179 మండల, గ్రామీణ ప్రాంతాల్లో, మిగిలిన కేసులు కరీంనగర్‌లోని వివిధ ప్రాంతాల్లో సోకింది. జమ్మికుంట మండలంలో 27 మందికి, శంకరపట్నంలో ఏడుగురికి, హుజురాబాద్‌లో మండలంలో 11, మానకొండూర్‌ మండలంలో 13, చొప్పదండి మండలంలో 10, వీణవంక మండలలో ఒకటి, గన్నేరువరం మండల కేంద్రంలో ఒకరికి, రామడుగు మండలంలో 10 మందికి, గంగాధర మండలంలో 10 మందికి, ఇల్లందకుంట మండలంలో 9 మందికి, తిమ్మాపూర్‌ మండలంలో 12 మందికి, కరీంనగర్‌ రూరల్‌ మండలంలో 14, కొత్తపల్లి మండలంలో 4, కొత్తపల్లి పట్టణంలో 6 కేసులు నమోదయ్యాయ్యి. అలాగే కరీంనగర్‌ పట్టణంలోని విద్యారణ్యపురిలో ఒకటి, సరస్వతి నగర్‌లో ఒకటి, తిరుమలనగర్‌లో ఒకటి, కట్టరాంపూర్‌లో నాలుగు, భగత్‌నగర్‌లో ఆరు, చైతన్యపురిలో ఒకటి, సుభాష్‌నగర్‌లో రెండు, బ్యాంకు కాలనీలో రెండు, వావిలాపల్లిలో మూడు, లక్ష్మీనగర్‌లో రెండు, కాపువాడలో రెండు, అశోక్‌నగర్‌లో రెండు, కోతిరాంపూర్‌లో ఒకటి, ఓల్డ్‌ బజార్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. 

Follow Us on:
Advertisement
Advertisement