
కృష్ణా/అవనిగడ్డ : జిల్లాలోని పాఠశాలలు ప్రారంభం కావడంతో కరోనా కేసులు బయటపడుతున్నాయి. నాగాయలంక మండలంలోని బావదేవరపల్లిలో కరోనా కలకలం రేపింది. గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటీవ్ వచ్చింది. దీంతో పాఠశాలకు మూడు రోజులపాటు సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. విద్యార్థులకు కరోనా రావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.