పెద్దపల్లి జిల్లాలో మరో 54 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-08-07T19:40:17+05:30 IST

పెద్దపల్లి జిల్లాలో మరో 54 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. పెద్దపల్లి ప ట్టణానికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ మైనార్టీ నాయకు డు ఒకరికి కరోనా రాగా, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు

పెద్దపల్లి జిల్లాలో మరో 54 మందికి కరోనా పాజిటివ్‌

856కు చేరుకున్న కేసుల సంఖ్య

పెద్దపల్లి పట్టణంలో ఒకరి మృతి


పెద్దపల్లి (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లాలో మరో 54 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. పెద్దపల్లి ప ట్టణానికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ మైనార్టీ నాయకు డు ఒకరికి కరోనా రాగా, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన మీడియా బులిటెన్‌లో పేర్కొన్నారు. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 856కు చేరుకున్నది. గోదావరిఖని, రామగుండం, మంథని, కమాన్‌పూర్‌, ఓదెల తదితర మండలాల్లోని వ్యక్తులకు కరోనా సోకినట్లుగా ని ర్ధారించారు. వారందరిని హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వ్యాధి తీవ్రత ఉన్నవారికి ప్రభుత్వఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.


కరోనాతో టీఆర్‌ఎస్‌ యూత్‌ నాయకుడి మృతి

కరోనా వ్యాధితో బుధవారం రా త్రి టీఆర్‌ఎస్‌ యూత్‌ నాయకుడు మృతిచెందాడు. నాలుగు రోజులుగా తీవ్ర అవస్థకు గురైన వ్యక్తిని గాంధీ అస్పత్రిలో చేర్చించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి కిడ్నీల సమస్య, షుగర్‌, ఇతర వ్యాధులున్నాయని వైద్యులు పేర్కొన్నారు. 


పెద్దపల్లి మండలంలో నలుగురికి..

పెద్దపల్లి రూరల్‌ మండలంలోని పలు గ్రామా ల్లో గురువారం కరోనా పాజిటివ్‌ కేసులు 4 నమో దైనట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. భోజన్నపేట లో 1, రంగపూర్‌లో 1, అందుగులపల్లిలో 1, గోప య్యపల్లిలో 1 కరోనా పాజిటివ్‌ నమోదైనట్లు వైద్యా ధికారులు తెలిపారు. వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 


కమాన్‌పూర్‌లో నలుగురికి..

కమాన్‌పూర్‌  మండలంలో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు తెలిపారు. ఇ ప్పటివరకు మండలంలో 16 కేసులు నమోదైనట్లు తెలిపారు. మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంకు లో అటెండర్‌, మండలపరిషత్‌ కార్యాలయంలో కం ప్యూటర్‌ ఆపరేటర్‌, మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు, కిష్టంపల్లెకు చెందిన మహిళకు పాజి టివ్‌ వచ్చినట్లు తెలిపారు.  


మంథనిలో ఐదుగురికి..

మంథనిలో మరో ఐదుగురికి గురువారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పట్టణంలోని శ్రీలక్ష్మీనారాయణస్వామి దేవాలయం ఏరి యాలో ఇద్దరికీ, ముత్యాలమ్మవాడకు చెందిన ఒకరి కి, ఈజీఎస్‌ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగికి, బ స్టాండ్‌లో పనిచేసే ఆర్టీసీ ఉద్యోగికి కరోనా లక్షణా లు కన్పించగా పరీక్షలు నిర్వహించుకున్నారు. వీరి కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈజీఎస్‌ కార్యాలయంలో ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ రావడం తో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ ఆదేశాల మేరకు మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బంది ఎంపీడీవో, ఈజీఎస్‌ కార్యాలయ ఆవరణల్లో సోడియంహైపోక్లోరైడ్‌ను పిచికారీ చేశారు. 

Updated Date - 2020-08-07T19:40:17+05:30 IST