ప్రకాశం జిల్లాలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-08-28T22:17:57+05:30 IST

ప్రకాశం జిల్లాలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు కొవిడ్ బారిన పడటం కలవరపాటుకు గురి చేస్తోంది.

ప్రకాశం జిల్లాలో కరోనా కలకలం

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు కొవిడ్ బారిన పడటం కలవరపాటుకు గురి చేస్తోంది. పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 76 మంది కొవిడ్ బారిన పడ్డారు. జిల్లాలో పాఠశాలలు పునః ప్రారంభమైనప్పటి(ఆగస్టు 16) నుంచి ఇప్పటివరకు 28 మంది విద్యార్థులు, 48 మంది ఉపాధ్యాయులు కొవిడ్‌ బారిన పడ్డారు. రాష్ట్రంలో స్కూళ్లు ప్రారంభమైన నాటి నుంచి కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 

Updated Date - 2021-08-28T22:17:57+05:30 IST