రద్దీ ప్రాంతాల్లో కరోనా జాగ్రత్తలు

ABN , First Publish Date - 2021-04-21T06:23:31+05:30 IST

నిర్మల్‌ పట్టణకేంద్రంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో క్లోరోఫిల్‌ ద్రావణం పిచికారీ చేయిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ తెలిపారు.

రద్దీ ప్రాంతాల్లో కరోనా జాగ్రత్తలు
పిచికారీ పనులు పరిశీలిస్తున్న ఈశ్వర్‌

మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ 

నిర్మల్‌ కల్చరల్‌, 20 : నిర్మల్‌ పట్టణకేంద్రంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో క్లోరోఫిల్‌ ద్రావణం పిచికారీ చేయిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ తెలిపారు. మంగళ వారం బస్టాండ్‌, అంబేద్కర్‌ చౌక్‌, తదితర రద్దీస్థలాల్లో మున్సిపల్‌ సిబ్బంది ద్రావ ణం పిచికారీ చేశారు. చైర్మన్‌ ఈశ్వర్‌ స్వయంగా పరిశీలించి సూచనలు చేశారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మాస్క్‌లు ధరించి భౌతికదూరం పాటించాలని కోరారు. స్వీయరక్షణతో కరోనాను ఎదుర్కొనవచ్చునని అన్నారు. కమిషనర్‌ బాలకృష్ణ, ఏఈ వినయ్‌, సానిటరీ ఇన్స్‌పెక్టర్‌ రవీందర్‌, అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

మృతుడి కుటుంబానికి చైర్మన్‌ సంతాపం

చింతకుంట వాడకు చెందిన రిటైర్డ్‌ టీచర్‌ లక్ష్మీ నారాయణగౌడ్‌ మృతి పట్ల చైర్మన్‌ ఈశ్వర్‌ సంతాపం ప్రకటించారు. మంగళవారం కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. నాయకులు అడప పోశెట్టి ఆయన వెంట ఉన్నారు.

Updated Date - 2021-04-21T06:23:31+05:30 IST