ద్వారకాతిరుమల ఆలయంలో కరోనా ఆంక్షలు

ABN , First Publish Date - 2021-04-23T22:27:04+05:30 IST

ద్వారకాతిరుమల ఆలయంలో కరోనా ఆంక్షలు

ద్వారకాతిరుమల ఆలయంలో కరోనా ఆంక్షలు

పశ్చిమగోదావరి: జిల్లాలోని ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో కరోనా ఆంక్షలు విధించారు. భక్తులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, శానిటైజర్స్ వినియోగించాలని అధికారులు సూచించారు. గర్భిణీలు, బాలింతలు, 10 సంవత్సరాలలోపు పిల్లలు, వృద్ధులకు స్వామి దర్శనానికి అనుమతి లేదని అధికారులు వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత ఉద్ధృతంగా ఉంది. నిన్న ఏపీలో 10 వేలకు పైగానే కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు, శానిటైజర్ ఉపయోగించాలని, తరచూ చేతులను కడుక్కోవాలని కోవిడ్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

Updated Date - 2021-04-23T22:27:04+05:30 IST