Advertisement

ఎల్లారెడ్డి పట్టణంలో కరోనా వదంతులు

Jun 30 2020 @ 05:59AM

ఎల్లారెడ్డి రూరల్‌, జూన్‌ 29 : ఎల్లారెడ్డి పట్టణంలోని బీసీ కాల నీకి చెందిన వ్యక్తికి కరోనా వచ్చిందంటూ వదంతులు రావడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అం దుకున్న వైద్య సిబ్బంది అప్రమత్తమై బీసీ కాలనీలో ఇంటింటికీ తిరు గుతూ సర్వే చేపట్టారు. పట్టణ ప్రజలు ఎవరూ భయపడవద్దని, పట్టణ కేంద్రంలో ఎవరికి కరోనా లేదని, వదంతులను నమ్మవద్దని మత్తమాల వైద్యుడు వెంకట స్వామి తెలిపారు. ఈ సర్వేలో వైద్య సిబ్బంది సుధారాణి, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. 


Follow Us on:
Advertisement
Advertisement