కరోనాతో సహజీవనం ఖాయమేనా?

ABN , First Publish Date - 2021-04-12T16:20:42+05:30 IST

కరోనాతో కలిసి జీవించే పరిస్థితి వచ్చేసిందా? అంటే అవుననే అనిపిస్తోంది.

కరోనాతో సహజీవనం ఖాయమేనా?

హైదరాబాద్: కరోనాతో కలిసి జీవించే పరిస్థితి వచ్చేసిందా? అంటే అవుననే అనిపిస్తోంది. మహమ్మారి సెకండ్ వేవ్‌తో మరింత బలపడి దూసుకొచ్చేస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్నవారిలో కూడా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్నాం కాదా అని అశ్రద్ద చేయొద్దని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. స్వీయ రక్షణే ప్రతి ఒక్కరికి శ్రీరామ రక్ష అని, మనకు మనమే రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


కొందరిదేమో బాధ్యతారాహిత్యం, మరికొందరిది గత్యంతరం లేని పరిస్థితి.. వెరసీ ఇంట్లో కరోనా పాజిటీవ్ రోగులు ఉన్నా..గప్ చుప్‌గా యదేచ్ఛగా జనాల్లోకి వచ్చేస్తున్నారు. అందరితో కలిసి తిరిగేస్తున్నారు. ఇంటి చుట్టుపక్కల, తాము పనిచేసే చోట కూడా ఏమీ తెలియనివ్వకుండా బండి లాగించేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజు రోజుకు పెరుగుతున్న కేసులకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో పాజిటీవ్ అని తేలిన వెంటనే అధికారులు ఇంటికొచ్చి మార్కు వేయడం, మందులు ఇవ్వడం వంటివి చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరైనా ఇంటికే పరిమితం కావాలనుకున్నా కాలేని పరిస్థితి.

Updated Date - 2021-04-12T16:20:42+05:30 IST