కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి : రమేష్‌కుమార్‌ మాదిగ

ABN , First Publish Date - 2020-08-08T09:47:23+05:30 IST

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్‌.రమేశ్‌కుమార్‌ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి : రమేష్‌కుమార్‌ మాదిగ

చిక్కడపల్లి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్‌.రమేశ్‌కుమార్‌ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం సం దర్భంగా శుక్రవారం సాయంత్రం గాంధీనగర్‌ డివిజన్‌లోని అరుంధతినగర్‌ బస్తీలో ఎమ్మార్పీఎస్‌ ముషీరాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గుండు వెంకటేష్‌ మాదిగ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.


ముఖ్యఅతిథిగా పాల్గొన్న రమేశ్‌మాదిగ మాట్లాడుతూ 2004లో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో గుండె జబ్బుల పిల్లలందరి కీ ఉచితంగా ఆపరేషన్లు చేయాలనే డిమాండ్‌కు తలొగ్గిన ప్రభుత్వం ఆగస్టు 7న గుండె జబ్బు చిన్నారులందరికీ ప్రభుత్వమే ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని హామీ ఇచ్చిందనీ సందర్భంగా తదనంతరం ఉచిత ఆపరేషన్ల పథకం ఆరోగ్యశ్రీగా రూపుదిద్దుకుందన్నారు. కార్యక్రమంలో ప్రశాంత్‌, మల్లయ్య, అబ్రామ్‌, మహ్మద్‌ ఇబ్రహీం సలీంపాషా, రంజిత్‌కుమార్‌యాదవ్‌, లక్ష్మమ్మ, యాదమ్మ, జయమ్మ, అంతమ్మ పాల్గొన్నారు. 


ఎమ్మార్పీఎస్‌ ప్రధాన కార్యాలయంలో..

బౌద్ధనగర్: పార్శిగుట్ట మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్‌) ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్‌ కో-కన్వీనర్‌ డప్పు మల్లికార్జున్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్‌ రమే్‌షకుమార్‌ మాదిగ కేక్‌ కట్‌ చేశారు. నాయకులు ఈశ్వర్‌, నర్సింగ్‌రావు, కృష్ణారావు, నిర్మల, బాలమణి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-08T09:47:23+05:30 IST