పిల్లల్లో తొలి లక్షణం అతిసారం!

ABN , First Publish Date - 2020-05-14T15:09:10+05:30 IST

కరోనా వైర్‌సతో పిల్లలకూ ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు అన్నారు. పెద్దల్లా పిల్లల్లోనూ దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యల రూపంలో ఇన్ఫెక్షన్‌ లక్షణాలు

పిల్లల్లో తొలి లక్షణం అతిసారం!

బీజింగ్‌, మే 13 : కరోనా వైర్‌సతో పిల్లలకూ ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు అన్నారు. పెద్దల్లా పిల్లల్లోనూ దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యల రూపంలో ఇన్ఫెక్షన్‌ లక్షణాలు బయటపడకపోవచ్చన్నారు. అతిసారం, జ్వరం రూపంలో తొలిసారిగా కరోనా అలికిడి కనిపించే సూచనలు ఉంటాయని చెబుతున్నారు. జీర్ణాశయ పేగుల్లో ఉండే కణాలను గ్రాహకాలుగా మార్చుకొని కొవిడ్‌-19 వైరస్‌ ఇన్ఫెక్షన్‌ను వ్యాపింపజేసేందుకు అవకాశాలు లేకపోలేదన్నారు. ఈ వివరాలతో చైనాలోని టాంగ్జి ఆస్పత్రి వైద్యులు ఓ అధ్యయన నివేదికను విడుదల చేశారు. కిడ్నీలో రాళ్లు, తలకు గాయం వంటి సంబంధం లేని కారణాలతో ఆస్పత్రిలో అత్యవసర వైద్యం కోసం చేరిన పిల్లల్లో కొందరికి న్యుమోనియా, ఇంకొందరికి కొవిడ్‌-19 ఉన్నట్లు తేలింది.

Updated Date - 2020-05-14T15:09:10+05:30 IST