భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు తప్పదా?

ABN , First Publish Date - 2021-10-27T19:34:54+05:30 IST

భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు తప్పదా? వైరస్ ఎప్పుడైనా విరుచుకుపడొచ్చా?...

భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు తప్పదా?

ఇంటర్‌నెట్ డెస్క్: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు తప్పదా? వైరస్ ఎప్పుడైనా విరుచుకుపడొచ్చా? మరోసారి కరోనా ప్రతాపం చూపిస్తుందా? దేశంలో మళ్లీ లాక్ డౌన్ తప్పదా? మున్ముందు కరోనా మరింతగా విజృంభిస్తుందా?... భారత్‌లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కరోనా లేదనే భావనలో ప్రజలు ఉన్నారు. దీంతో కరోనా నిబంధనలను పూర్తిగా గాలికొదిలేశారు. మాస్క్ లేకుండా యధేచ్ఛగా తిరుగుతున్నారు. ఇలాగే కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే థర్డ్ వేవ్ ముప్పు త్వరలోనే విరుచుకుపడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఇప్పటికే కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ మొదలైంది. రష్యా, బ్రిటన్‌లో కేసులు అమాంతం పెరిగాయి. చైనాలోనూ వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. ఈ క్రమంలో త్వరలోనే భారత్‌లోనూ థర్డ్ వేవ్ ముప్పు ఉండనుందా? అనే భయాందోళన చెందుతున్నారు. అలాగే అంతర్ రాష్ట్ర, అంతర్జాతీయ రాకపోకలు మామూలుగానే కొనసాగుతున్నాయి. కొత్త వేరియంట్లు సయితం భారత్‌లో ప్రవేశించడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2021-10-27T19:34:54+05:30 IST