చిరంజీవి అల్లుడు కల్యాణ్‌దేవ్‌కు కరోనా

Apr 23 2021 @ 00:26AM

ఇటీవలె హీరో పవన్‌ కల్యాణ్‌ కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో మరో నటుడు కరోనా బారిన పడ్డారు. చిరంజీవి చిన్నల్లుడు, హీరో కల్యాణ్‌ దేవ్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ‘‘స్వల్ప లక్షణాలుండడంతో బుధవారం పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ అని తెలిసింది. దాంతో హాస్పిటల్‌లో చేరి వైద్యచికిత్స తీసుకుంటున్నాను’’ అని ఆయన ట్విట్టర్లో తెలిపారు. ‘విజేత’ సినిమాతో కల్యాణ్‌ దేవ్‌ తెలుగు తెరకు పరిచయమయ్యారు. ప్రస్తుతం ‘సూపర్‌మచ్చి’, ‘కిన్నెరసాని’ చిత్రాల్లో నటిస్తున్నారు. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.