కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

ABN , First Publish Date - 2020-08-08T05:37:13+05:30 IST

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో తాండూరులో శుక్రవారం ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

తాండూరు : కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో తాండూరులో  శుక్రవారం ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా  సంఘం సీనియర్‌ నాయకుడు ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రస్తుతం కొవిడ్‌తో బాధపడుతున్న  పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని కరోనా వైద్యం ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలన్నారు.  నర్సింహులు మాదిగ,  దశరథ్‌, బాల్‌రాజ్‌, గోపాల్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


కేసీఆర్‌ మేలుకో.. ప్రజల ప్రాణాలు కాపాడు

కొడంగల్‌రూరల్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేల్కొని, ప్రజల ప్రాణాలు కాపాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఇందనూర్‌బషీర్‌ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన కొడంగల్‌లో విలేఖరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.రాజు, ముస్తాఫా, శ్రీనివాస్‌, ఎండీ.రహీం తదితరులు పాల్గొన్నారు. 


మోమిన్‌పేటలో..

మోమిన్‌పేట: కొవిడ్‌-19ను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని సర్పంచుల సంఘం మాజీ మండలాధ్యక్షుడు మన్నె శంకర్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో స్థానిక నాయకులు మానెయ్య, సురేందర్‌లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్లెలకు సైతం పాకుతున్న కరోనాతో పేద, మధ్య తరగతి ప్రజలు చికిత్స కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 

Updated Date - 2020-08-08T05:37:13+05:30 IST