కరోనా కందాలు

ABN , First Publish Date - 2021-04-22T06:07:12+05:30 IST

మూతికి వేసెయ్ మాస్కును చేతికి తగు శానిటైజు చెరచెర రాసెయ్ గోతికి వద్దనుకుంటే...

కరోనా కందాలు

మూతికి వేసెయ్ మాస్కును

చేతికి తగు శానిటైజు చెరచెర రాసెయ్

గోతికి వద్దనుకుంటే

భౌతికదూరం జరగర బతకాలంటే 

ఇల్లే పదిలం బాబూ 

ముల్లెలు కాపాడలేవు ముట్టిన వైరస్

గుల్ల కదా సంసారం 

పల్లెలు పట్నాలు ఒకటె భద్రం కొడుకా.

గుడులూ, మసీదులైనా

నడిచే దేవుళ్ళు, క్రీస్తు నట్టిళ్లైనా 

పడిపడి జనాలు చేరితె

వడిగా వైరస్సు పట్టు వదలదు వినరా

భక్తీ దేవుళ్ళు మతము 

ముక్తీ మోక్షం కొరకని మొండిగ పోతే

శక్తేదీ కాపాడదు 

ముక్తీ మోక్షము కరోనే మొదటికె మోసం.

ఆపదలో ఊళ్ళన్నీ

కాపాడే వైద్యులిపుడు కదిలే దైవాల్ 

ఏపున దోచే వారే

పాపులు పీనుగ పురుగులు భ్రష్టులు వారే

ఇంట్లోనే భక్తి కుదురు

ఒంట్లోనే గుడిమసీదు ఒనరుగ చూస్తే

కంట్లోనే కలల జగతి

మంట్లోనే మతములన్ని మనుషులె సత్యం

పులికొండ సుబ్బాచారి

Updated Date - 2021-04-22T06:07:12+05:30 IST