జీజీహెచ్‌కు క్యూ కట్టిన కరోనా వాక్సిన్ బాధితులు

ABN , First Publish Date - 2021-01-25T01:17:51+05:30 IST

జీజీహెచ్‌కు కరోనా వాక్సిన్ బాధితులు క్యూ కట్టారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ రియాక్షన్‌తో 17 మంది ఆసుపత్రిలో చేరారు. 10 మందికి వైద్యం చేసి వైద్యులు డిశ్చార్ చేశారు

జీజీహెచ్‌కు క్యూ కట్టిన కరోనా వాక్సిన్ బాధితులు

గుంటూరు: జీజీహెచ్‌కు కరోనా వాక్సిన్ బాధితులు క్యూ కట్టారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ రియాక్షన్‌తో 17 మంది ఆసుపత్రిలో చేరారు. 10 మందికి వైద్యం చేసి వైద్యులు డిశ్చార్ చేశారు. ఇంకా ఏడుగురికి చికిత్స కొనసాగుతోంది. బాధితుల వివరాలను వైద్యశాఖ గోప్యంగా ఉంచుతోంది. విజయలక్ష్మి మృతితో మిగతా బాధిత కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఆశా వర్కర్ విజయలక్ష్మి మృతి చెందిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ వేయించుకుని అనారోగ్యానికి గురైన ఆమె జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించింది. ఈ నెల 19న విజయలక్ష్మి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంది. 21వ తేదీన అస్వస్థతకు గురై జీజీహెచ్‌లో చేరింది. ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యులు.. బ్రెయిన్‌ స్ట్రోక్‌తో చనిపోయినట్లు ఆదివారం ఉదయం ప్రకటించారు. విజయలక్ష్మి తాడేపల్లి మండలం, పెనుమాకలో ఆశా వర్కర్‌గా పని చేస్తోంది. 

Updated Date - 2021-01-25T01:17:51+05:30 IST