Advertisement

LIVE: తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరం

Jun 30 2020 @ 07:57AM

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కోటి మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇక దేశంలో 5లక్షల పైచిలుకు కేసులు నమోదు అవడంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తిపై మొదటి నుంచి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వైరస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోని పరిస్థితి. దీంతో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇటు తెలంగాణలో మరీ ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య 10వేలకు పైచిలుకుగా ఉండటం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో మిగిలిన ప్రాంతాల్లో చర్యలు కొనసాగిస్తుండగా, హైదరాబాద్‌లో కేసులు పెరుగుతున్న తీరు ప్రజలను, అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ మరో పదిహేను రోజులు పొడిగిస్తే గానీ పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం లేదని ఉన్నతస్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై ఏబీఎన్ మార్నింగ్ ఇష్యూలో చర్చ చేపట్టారు. ఈ చర్చలో టీడీపీ ఎమ్మెల్సీ రామకృష్ణ, టీ.బీజేపీ నేత అల్జాపూర్ శ్రీనివాస్, టి.సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, ఏపీ మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పాల్గొన్నారు. చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. 

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.