కర్ఫ్యూ అమలుతో కొవిడ్‌ నియంత్రణ

ABN , First Publish Date - 2021-05-10T05:19:05+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ తెలిపారు.

కర్ఫ్యూ అమలుతో కొవిడ్‌ నియంత్రణ
నగరంలో పర్యటిస్తున్న ఎస్పీ అస్మీ

కాకినాడ క్రైం, మే 9: కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ తెలిపారు.  కాకినాడ సిటీలోని పలు ముఖ్యమైన సెంటర్లలలో కర్ఫ్యూ అమలును శనివారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులు, ప్రయాణికులకు కొవిడ్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. కాకినాడ డీఎస్పీ వి.భీమారావు, ట్రాఫిక్‌ డీఎస్పీ పి.మురళీకృష్ణారెడ్డి, ఎస్‌బీ డీఎస్పీ ఎం.అంబికా ప్రసాద్‌, ట్రాఫిక్‌ సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

212 మందిపై కేసులు

కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి మాస్క్‌ధారణ చేయనివారిపై జిల్లాలో ఆదివారం 212 మందిపై కేసులు నమోదు చేసి రూ. 17,900 లు జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ తెలిపారు. ప్రతీ ఒక్కరూ విధిగా మాస్క్‌ ధరించాలని కోరారు. మాస్క్‌ వేసుకోకుండా బయటకు రావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఎస్పీ చెప్పారు. అలాంటి వారిపై చర్యలు తప్పవని అద్నాన్‌ నయీం తెలిపారు.

Updated Date - 2021-05-10T05:19:05+05:30 IST