తెలంగాణలో కొత్తగా 4,976 కరోనా కేసులు, 35 మంది మృతి

ABN , First Publish Date - 2021-05-09T23:54:46+05:30 IST

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు.

తెలంగాణలో కొత్తగా 4,976 కరోనా కేసులు, 35 మంది మృతి

హైదరాబాద్: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు.  కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎన్నిచర్యలు చేపట్టిన ఫలితం కనిపించడం లేదు. కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలో 4,976 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,97,361 లక్షలకు చేరింది. ఇందులో 4,28,865 లక్షల మంది రికవరీ అయ్యారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 65,757 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే జీహెచ్ఎంసీలో 851, రంగారెడ్డి 417, మేడ్చల్‌లో 384 కరోనా పాసిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో కొత్తగా కరోనాతో 35 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,739కి చేరింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్లు వాడాలని సూచించారు. కరోనాను నిర్లక్ష్యం చేయొద్దని జాగ్రత్తలు పాటించాలని  వైద్యులు హెచ్చరించారు. 

Updated Date - 2021-05-09T23:54:46+05:30 IST