కరోనా విజృంభణ...సర్కార్ దవాఖానాల్లో పడకల్లేవ్

ABN , First Publish Date - 2021-04-22T17:10:20+05:30 IST

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా రోగులతో సర్కారు దవాఖానాలోని పడకలు నిండుకున్నాయి.

కరోనా విజృంభణ...సర్కార్ దవాఖానాల్లో పడకల్లేవ్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో సర్కారు దవాఖానాల్లో పడకలు నిండుకున్నాయి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్స్ కొరత ఏర్పడింది. ముఖ్యంగా కరోనా నోడల్ సెంటర్స్‌గా ఉన్న గాంధీ, టిమ్స్‌లో ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్స్ కొరత తీవ్రంగా ఉంది. చెస్ట్ హాస్పిటల్, కింగ్ కోటి హాస్పిటల్స్‌లో రెగ్యులర్ బెడ్స్ కొంత వరకు ఉన్నప్పటికీ ఐసీయూ, వెంటిలెటర్స్  బెడ్స్ ఫుల్ అయ్యాయి. అటు జిల్లాల్లో ఐసీయూ, వెంటిలేటర్స్ అందుబాటులో లేకపోవడంతో అందరూ హైదరాబాద్‌కు క్యూకట్టారు. ఒకరికి ఐసీయూ బెడ్ ఇవ్వాలంటే... మరొకరు ఊపిరి ఆగాల్సిందే అన్న పరిస్థితి నెలకొంది. బెడ్స్‌ను సమకూర్చడంలో ఆరోగ్యశాఖ విఫలం అయ్యిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో పేషంట్... పది హాస్పిటల్స్ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోడరేట్, సివియర్ కరోనా  రోగుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ప్రైవేట్‌లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మాటల మీద పెట్టిన శ్రద్ధ, చేతల్లో చూపించడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. మే నెలాఖరుకు మరింత దాయనీయమైన పరిస్థితులు వస్తాయని హెల్త్ ఎక్స్పర్ట్ చెబుతున్నారు. 

Updated Date - 2021-04-22T17:10:20+05:30 IST