హైదరాబాద్‌లో వైరస్ విజృంభణతో ఆందోళన

ABN , First Publish Date - 2020-07-06T16:48:13+05:30 IST

నగరంలో కరోనా వైరస్ బెంబేలెత్తిస్తోంది.

హైదరాబాద్‌లో వైరస్ విజృంభణతో ఆందోళన

హైదరాబాద్‌: నగరంలో కరోనా వైరస్ బెంబేలెత్తిస్తోంది. రోగుల పట్ల కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు దారుణంగా వ్యవహరిస్తున్నాయి. జలగల్లా కరోనా బాధితుల రక్తం తాగుతున్నాయి. ఆస్పత్రిలో చేరడమే పాపం. లక్షల్లో బిల్లువేసి జేబులు గుల్ల చేస్తున్నాయి. బాధితులు డబ్బు కట్టకపోతే దారుణాలకు పాల్పడుతున్నారు. ఎక్కువ మొత్తంలో బిల్లులు వేస్తూ.. చెల్లిస్తేగానీ వదిలేది లేదంటున్నారు. ఫీవర్ ఆస్పత్రి డిఎంవో ఘటనతో ప్రైవేటు ఆస్పత్రుల వ్యవహారం బయటపడింది. 


తుంబే ఆస్పత్రి లాంటి ఘటనే హైదరాబాద్‌లో మరొకటి జరిగింది. జూన్ 25న గచ్చిబౌళిలోని ఓ కర్పొరేట్ ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి  చికిత్సకోసం వెళ్లాడు. అయితే పరిస్థితి విషమించి జులై 4న ఆ వ్యక్తి మృతి చెందాడు. మొత్తం రూ. 7 లక్షల 20వేలు బిల్లు వేశారు. రూ. 4 లక్షలు ఇన్సూరెన్స్ క్లైమ్ అయిందని, మిగిలిన డబ్బు చెల్లించాలని, లేకపోతే మృత దేహాన్ని ఇవ్వమంటూ సిబ్బంది బెదిరింపులకు దిగినట్లు మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కరోనా చికిత్స పేరుతో ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడి మామూలుగా లేదని.. రోగులను దోచుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2020-07-06T16:48:13+05:30 IST