గోవాలో మరోసారి కరోనా కర్ఫ్యూ పొడిగింపు

Jun 19 2021 @ 23:48PM

పనాజీ: గోవాలో కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న కర్ఫ్యూను ఈ నెల 28 వరకు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. ఇవాళ ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘రాష్ట్ర వ్యాప్త కర్ఫ్యూను 2021 జూన్ 28 ఉదయం 7 గంటల వరకు పొడిగిస్తున్నాం. సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీ ఫ్లెక్సులు, ఎంటర్‌టైన్మెంట్ జోన్లు మినహా షాపింగ్ మాల్స్‌లోని షాపులను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తెరుచుకోవచ్చు. చేపల మార్కెట్‌ను కూడా తెరవచ్చు...’’ అని పేర్కొన్నారు. గోవాలో తొలిసారి మే 9న కరోనా ఆంక్షలను అమల్లోకి తెచ్చారు. తర్వాత వీటిని పలు మార్లు పొడిగిస్తూ వచ్చారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.