రాష్ట్రాలకు కేంద్రం కరోనా హెచ్చరిక లేఖ!

ABN , First Publish Date - 2021-07-29T17:41:55+05:30 IST

దేశంలో కరోనా థర్డ్ వేవ్ గురించి నిపుణులు తరచూ...

రాష్ట్రాలకు కేంద్రం కరోనా హెచ్చరిక లేఖ!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్ వేవ్ గురించి నిపుణులు తరచూ హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో వచ్చే నెల పండుగ సీజన్ కావడంతో కేంద్రం మరింత అప్రమత్తమయ్యింది. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కరోనా విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలంటూ లేఖ రాసింది. ఆర్ ఫ్యాక్టర్‌ (రీప్రొడక్షన్ రేటు)పై దృష్టి సారించాలని కోరింది. అంటే వైరస్ ఉధృతిని అదుపు చేయడంపై దృష్టి పెట్టాలని కోరింది. 


 కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు రాసిన లేఖలో కొన్ని రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి రేటు ఒక శాతం ఉందని, మరికొన్ని రాష్ట్రాల్లో దీనికి మించి ఉన్నదని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాల వారీగా పాజిటివిటీ రేటును పరిగణలోకి తీసుకుని, రాష్ట్రాలు వైరస్‌ను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలంతా కరోనా ప్రొటోకాల్ పాటించేలా చూడాలని, టెస్ట్, ట్రాక్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ మొదలైన విషయాల్లో అధికారులు చురుకుగా వ్యవహరించాలని భల్లా ఆ లేఖలో ఆదేశించారు. 

Updated Date - 2021-07-29T17:41:55+05:30 IST