కార్పొరేట్‌ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-11-24T10:19:28+05:30 IST

కేంద్రం కార్పొరేట్‌ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కిసాన్‌ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపెల్లి మాల్లారెడ్డి డిమాండ్‌ చేశారు

కార్పొరేట్‌ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

కిసాన్‌ సభ జాతీయ ఉపాధ్యక్షుడు మాల్లారెడ్డి


దుగ్గొండి, నవంబరు 23: కేంద్రం కార్పొరేట్‌ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కిసాన్‌ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపెల్లి మాల్లారెడ్డి డిమాండ్‌ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ చేపట్టిన జీపు జాతాను మండలంలోని గిర్నిబావిలో సోమవారం ప్రారంభించి మాట్లాడారు. కార్పొరేట్లకు వ్యవసాయాన్ని అప్పగించడానికి చట్టాలను తీసుకురావడం జరిగిందన్నారు. రైతుల పంటల గిట్టుబాటు ధరను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా, సభ్యుల సలహాలు తీసుకోకుండా ఏకపక్షంగా చట్టాలు తేవడం బీజేపీకే దక్కుతుందన్నారు. విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు 26న జరిగే సార్వత్రిక సమ్మెకు మద్దుతు తెలపాలన్నారు. కార్యక్రమంలో ఈసంపల్లి బాబు, చల్లా నర్సింహారెడ్డి, చెల్పూరి మొగిలి, పుచ్చకాయల కృష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డి, కోడెం రమేశ్‌, ఓదెలు, బోల్ల సాంబయ్య, లింగారెడ్డి, ఎలేందర్‌రెడ్డి తదితరలు పాల్గొన్నారు.


నర్సంపేట : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ, విద్యుత్‌ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘం రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ డిమాండ్‌ చేశారు. ఈ నెల 26,27 తేదీల్లో జరిగే సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ చేపట్టిన జీపు జాతాను నర్సంపేటలో సోమవారం ప్రారంభించారు. విద్యుత్‌ చట్టం వల్ల రైతులు తమ వ్యవసాయ మోటార్లకు బిల్లులు చెల్లించాల్సి వస్తుందన్నారు. సార్వత్రిక సమ్మెను కార్మికులు, రైతులు విజయవంతం చేసి మోదీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్‌.రంగయ్య, భూక్య సమ్మయ్య, కొరబోయిన కుమారస్వామి, స్వామి, బుర్రి ఆంజనేయులు, వీరాచారి, సీఐటీయూ నాయకులు అనంతగిరి రవి, హన్మకొండ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-24T10:19:28+05:30 IST