కార్పొరేట్‌ పాఠశాలలను దీటుగా గురుకులాలు

ABN , First Publish Date - 2022-09-26T06:17:09+05:30 IST

కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలలకు ధీటుగా గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయని జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు.

కార్పొరేట్‌ పాఠశాలలను దీటుగా గురుకులాలు
మాట్లడుతున్న జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి

-  జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి 

- జోనల్‌ స్థాయి గురుకులాల క్రీడలు ప్రారంభం

తంగళ్లపల్లి, సెప్టంబర్‌ 25: కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలలకు ధీటుగా గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయని జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. ఆదివారం తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి గ్రామం సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో జోనల్‌ స్థాయి క్రీడలను ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గురుకులాల రూపు రేఖలు మార్చేశామన్నారు.. నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహా రాన్ని ఆందిస్తున్నట్లు చెప్పారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురుకులాలపై  ప్రత్యేక దృష్టి సారించా రని, గురుకుల పాఠశాలలను ప్రైవేట్‌ పాఠశాల కు దీటుగా అభివృద్ధి చేస్తున్నారని అ న్నారు. అలాగే విద్యతోపాటు క్రీడలను ప్రోత్సహిస్తున్నా రని, అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని అన్నారు.  ప్రస్తుతం గురుకులాల్లో ప్రవేశాల కోసం డిమాండ్‌ ఉందని అడ్మిషన్‌ రొరకని పరిస్థితి ఉందని అ న్నారు. విద్యార్ధులు స్నేహ పూరిత వాతావరణంలో క్రీడల్లో భాగస్వాములు కావాలని సూచించారు. క్రీడల్లో మూడు జిల్లా ల్లోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల కు చెందిన విద్యార్ధులు పాల్గొం టున్నారు.  కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పవర్‌లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌కుమార్‌, జడ్పీటీసీ పుర్మాణి మంజుల లింగారెడ్డి, ఎంపీపీ పడిగెల మానస రాజు, జిల్లా శిశు సంక్షేమ అధికారి లక్మిరాజం, డీసీవో జాక్వెలిన్‌, ఎంపీటీసీ సిలివేరి ప్రసూన నర్సయ్య, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య,  సీఐ ఉపేందర్‌, ఎస్సై లక్ష్మారెడ్డి, ప్రిన్సిపాల్‌ దర్శనాల పద్మ తది తరులు పాల్గొన్నారు.

- మూడు జిల్లాలు.. 1105 మంది విద్యార్ధులు

జోనల్‌ స్థాయి క్రీడల్లో రాజన్న సిరిసిల్ల, మెదక్‌, కరీంనగర్‌ జిల్లాలోని 13 సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన 1105 మంది విద్యా ర్ధులు క్రీడాల్లో పాల్గొంటున్నారు.  మూడు రోజులపాటు క్రీడలు నిర్వహిం చనున్నారు.  అండర్‌ 14, అండర్‌ 17 అండర్‌ 19లో వాలీబాల్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, కబడ్డీ, హ్యాండ్‌బాల్‌, ఖోఖో,  చెస్‌, క్యారమ్‌, ఫుట్‌బాల్‌, అథ్లెటిక్స్‌ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ పద్మ తెలిపారు. 

Updated Date - 2022-09-26T06:17:09+05:30 IST