కమిషనర్‌తో వివాదమే కారణమా?
నెల్లూరు (సిటీ), జనవరి 23 : నెల్లూరు నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ పార్థసారధి సోమవారం నుంచి సుదీర్ఘ సెలవుపై వెళ్లనున్నారు. ఈ మేరకు శనివారం విశ్వసనీయ సమాచారం అందింది. ఇటీవల కమిషనర్ కే దినేష్‌కుమార్‌తో ఆయన ఏర్పడిన వివాదమే అందుకు కారణమని కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. రెవెన్యూ రాబడిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆశించిన స్థాయిలో పన్ను వసూళ్లు చేయలేకున్నారని ఇటీవల కమిషనర్ డీసీని ప్రశ్నించారు. ఏడీసీ ముందే నిలదీయడంతో అవమానంగా భావించిన ఆయన కమిషనర్ పై ఎదురుదాడి చేస్తూ తనను ప్రభుత్వానికి సరెండర్ చేయండి, లేదా సెలవు పై వెళ్లిపోతానని తెగేసి చెప్పాడనే అంశం ప్రస్తుతం కార్పొరేషన్ కార్యాలయంలో హాట్ టాపిక్‌గా మారింది.