కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రూపుదిద్దుకొన్న చిత్రం ‘కార్పొరేటర్’. ‘షకలక’శంకర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సునీతా పాండే, లావణ్యా శర్మ, కస్తూరి హీరోయిన్లు. రెండు పాటలు మినహా చిత్రం పూర్తయిందని చిత్ర నిర్మాత ఎ.పద్మనాభరెడ్డి చెప్పారు. వినోదానికి పెద్ద పీట వేస్తూ చక్కని సందేశంతో చిత్రం రూపుదిద్దుకొందని దర్శకుడు సంజయ్ పూనూరి చెప్పారు.