నిర్లక్ష్యం !

ABN , First Publish Date - 2021-12-01T05:30:00+05:30 IST

సరైన నిర్వహణ లేక నగరంలో 35 ఏళ్ల కిందట నిర్మించిన రెండు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.

నిర్లక్ష్యం !

ఇప్పటికే పైభాగం కూలిన మార్కెట్‌ వైపున్న కాంప్లెక్స్‌

కూల్చివేయాలని నివేదిక ఇచ్చిన జేఎన్టీయూ

పట్టించుకోని టౌనప్లానింగ్‌, ఇంజనీరింగ్‌ అధికారులు

ఆందోళనలో 80 దుకాణాల యజమానులు

అనంతపురం కార్పొరేషన, డిసెంబరు 1:  సరైన నిర్వహణ లేక నగరంలో 35 ఏళ్ల కిందట నిర్మించిన రెండు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.  ఎప్పుడూ కూలి పోతాయో తెలియని పరిస్థితి. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని పాతూరు(తాడిపత్రి రోడ్డు)లో రెండు ము న్సిపల్‌ భవనాలున్నాయి. రెండతస్తులున్న ఆ భవనాలలోని గదులను దుకాణాలు నడుపుకునేందుకు లీజుకిచ్చారు. ఒక్కో భవనంలో 40 చొ ప్పున మొత్తం 80 దుకాణాలున్నాయి. ఈ ఏడాది మార్చిలో వర్షం కురిసిన సందర్భంలో అందులోని ఓ భవనం ముందుభాగం కూలిపోయింది. అయినా ఇంజనీరింగ్‌, టౌనప్లానింగ్‌ అధికారుల్లో మాత్రం చలనం లేదు.  శిథిలావస్థ భవనాలను గుర్తించిన పాపాన పోలేదు. ప్రైవేట్‌ భవనాలు మినహాయిస్తే ఏకంగా ప్రభు త్వ శాఖల భవనాలు  కూలే పరిస్థితుల్లో కూడా అధికా రుల్లో చలనం లేకపోవడంపై  విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ముందు భాగం కూలినప్పటి నుంచి దు కాణదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏళ్లనుంచే భవనం అలా ఉన్నా.. మరమ్మతులు కూ డా వారే చేసుకుంటూ వచ్చారు. 


80 దుకాణాలపై అయోమయం..

పాతూరు మున్సిపల్‌ కాంప్లెక్స్‌లోని 80 దుకాణాలపైనా అయోమయం నెలకొంది. ప్రధాన రహదారికి ఇరువైపులా ఒక్కో భవనం కింది భాగంలో 18 నుంచి 20 చొప్పున పై భాగంలో 20వరకు దుణాలున్నాయి. కింది  భాగంలో ఉన్న దుకాణాలకు డిమాండ్‌ ఎక్కువ. ప్రధాన రహదారి కావడంతో ఆ ప్రాంతం నిత్యం రద్దీగానే ఉంటుంది. ఏళ్ల నుంచి ఆ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ ఏడాది మార్చిలో కురిసిన పెద్ద వర్షానికి కూరగాయల మార్కెట్‌వైపున్న కాంప్లెక్స్‌లో ముందుభాగం కూలింది. దీంతో కొన్ని రోజుల పాటు దుకాణాలు మూసివేయిం చారు. తర్వాత తాత్కాలిక  మరమ్మతులతో యథాతథంగా నడిపిస్తున్నారు. ఆ భవనానికి చుట్టూ గోడ భాగం కూలి పోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కుడివైపు ఉన్న కాంప్లెక్స్‌ సైతం శిథిలావస్థలోనే ఉంది. కూలిపోయేదశలో ఉండటంతో దుకాణదారులు ఆందోళన చెందుతున్నారు. 


కూల్చేయాలని నివేదికిచ్చినా పట్టదా...?

మార్కెట్‌ వైపున్న కాంప్లెక్స్‌ ముందుభాగం కూలడంతో నగరపాలక సంస్థ ఉన్నధికారులు ఆ భవనంపై  దృష్టి సారించారు. ఆ భవన పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కార్పొ రేషన అధికారులు జేఎనటీయూ ఇంజనీరింగ్‌ విభాగాన్ని కోరారు. వారు ఆ భవనాన్ని పరిశీలించి భవనం శిథిలా వస్థకు చేరుకుందని, భవన నిర్మాణం సరిగా లేదని, కూ ల్చి వేయడమే మంచిదని నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఆ నివేదిక ఇచ్చి కూడా రెండు నెలలపైనే అవుతోంది. కానీ అటు టౌనప్లానింగ్‌ కానీ ఇటు ఇంజనీరింగ్‌ అధికారులు కానీ చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం వర్షాలు పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఆ భవనం కూలిపోతే అందుకు అధికా రులే బాధ్యులన్న సంగతి మరువరాదు. నిర్లక్ష్యానికి పరా కాష్టగా మారకముందే ఆ భవనంపై నిర్ణయం తీసుకోవా ల్సిన అవసరం ఉంది. 


ఏళ్లు గడిచినా ఒకే విధానమేనా ?

నగరపాలక సంస్థ అధికారులు పాత చింతకాయ పద్ధతులను అనుసరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్‌  కాంప్లెక్స్‌లంటే పాత గదులు...నెర్రలు చీలిన గోడలు... దుర్వాసన వెదజల్లే కారిడార్‌లు ఇవే కనిపి స్తాయి. ఇప్పటికైనా అలాంటి పద్ధతులకు ముగింపు పలక కపోతే మున్సిపల్‌ కాంప్లెక్స్‌ల్లో గదులు కావాలనుకునే వారు  తక్కువయ్యే ప్రమాదం ఉంది.  పాతూరు మున్సి పల్‌ కాంప్లెక్స్‌లలో పై భాగంలోని గదులకు అద్దెలు తక్కు వ. అంతపైకి వినియోగదారులు వెళ్లలేని పరిస్థితి.   మా ర్కెట్‌ నిర్వహిస్తున్న స్థలం కూడా కార్పొరేషనదే... మార్కెట్‌ మరోచోటికి తరలించాలన్న ప్రతిపాదన కూడా అటకెక్కిం ది. ఆ భవనాలను కూల్చివేసి వాటి స్థానంలో భవిష్యత్తు కోసం అధునాతనంగా నిర్మించవచ్చు. నగరపాలక సం స్థకు ఆదాయమూ వచ్చే అవకాశం ఉంది. మరి  అధికా రులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..? వేచి చూడా ల్సిందే. 

Updated Date - 2021-12-01T05:30:00+05:30 IST