మున్సిపాలిటిలో జోరుగా అవినీతి, అక్రమాలు

ABN , First Publish Date - 2022-07-01T06:37:50+05:30 IST

ప్రభుత్వ నియమ, నిబంధనలకు తిలోదకాలిస్తూ మున్సిపల్‌ పరిధిలో జోరుగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నా యని భైంసా మున్సిపల్‌ బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు

మున్సిపాలిటిలో జోరుగా అవినీతి, అక్రమాలు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ కౌన్సిలర్లు

భైంసా మున్సిపల్‌ బీజేపీ కౌన్సిలర్ల ధ్వజం

భైంసా, జూన్‌ 30: ప్రభుత్వ నియమ, నిబంధనలకు తిలోదకాలిస్తూ  మున్సిపల్‌ పరిధిలో జోరుగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నా యని భైంసా మున్సిపల్‌ బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు గురువారం 11వ  వార్డు మున్సిపల్‌ కౌన్సిలర్‌ కపిల్‌సిందే నేతృత్వంలో మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇటీవల మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన హెల్త్‌వర్కర్స్‌, నాన్‌ హెల్త్‌ వర్కర్స్‌ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలు తుంగలో  తొక్కారని ఆరో పించారు. ఉపాధి కల్పన కార్యాలయం నుంచి వచ్చిన కాల్‌లెటర్‌ అభ్య ర్థులను కాకుండా ఇతరులను ఉద్యోగాల్లో నియమించారని ఆరోపించారు. ఉద్యోగాల్లో నియమింపబడిన అభ్యర్థులకు సంబంధిత ఉద్యోగ విధులు కాకుండా రెవెన్యూ, కంప్యూటర్‌ సెక్షన్‌ విభాగాల్లో విధులు అప్పచెప్పార న్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ బిపాస్‌ అమలు అవుతుండగా   భైంసా మున్సిపాలిటిలో మాత్రం ఇప్పటికి మ్యాన్‌వల్‌ విధానమే కొన సాగుతోందనని వెల్లడించారు. అన్ని విషయాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు అనిత సూత్రావే (7వ వార్డు), శాంత గాడేకర్‌ (6వ వార్డు),  గాలోల్ల నర్సుబాయి (14వ వార్డు), అల్లెం లక్ష్మీ (22వ వార్డు), దశరథ్‌ (12వ వార్డు)తో పాటు బీజేపీ పట్టణ కమిటీ మాజీ అధ్యక్షుడు గాలి రవి, ప్రతినిధులు అల్లెం దిలిప్‌, రావుల పోశెట్టి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T06:37:50+05:30 IST