అవినీతి పాలనను అంతమొందించాలి

ABN , First Publish Date - 2022-08-19T06:27:31+05:30 IST

రాష్ట్రంలో అవనీతి పాలన అంతమెందించేందుకు యువకులు, యువ తులు, ఉద్యోగులు ఏకం కావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరణ్‌ చుగ్‌ పిలుపునిచ్చా రు.

అవినీతి పాలనను అంతమొందించాలి
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌

డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తోనే బంగారు తెలంగాణ 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌

కోరుట్ల, ఆగస్టు 18 : రాష్ట్రంలో అవనీతి పాలన అంతమెందించేందుకు యువకులు, యువ తులు, ఉద్యోగులు ఏకం కావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరణ్‌ చుగ్‌ పిలుపునిచ్చా రు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో జిల్లా అధ్యక్షుడు సత్యానారా యణరావు, రాష్ట్ర ప్రదాణ కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డి, నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు తరుణ్‌ చుగ్‌ ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. కోరుట్ల పట్టణానికి చెందిన వ్యాపారవేత్త సురభి నవీన్‌ బీజేపీలో చేరగా అతనికి పార్టీ కండవా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తరుణ్‌ చుగ్‌ మాట్లాడారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో బంగారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాద్యామవుతుందని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనలో కేసీ ఆర్‌ ప్రభుత్వం విఫలమైందని, కుటుంబంలో ప్రతి ఒక్కరికి రాజకీయ ఉపాధి కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కుతుందని అన్నారు. అహంకార ప్రభుత్వం నుంచివిముక్తి పొందుదా మని, కేసీఆర్‌ బై...బై చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే బంగారు తెలంగాణ నిర్మాణం చేసి అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని అన్నారు. దేశ అభివృ ద్ధిలో నరేంద్ర మోదీ చేస్తున్న కృషి గొప్పదని అన్నారు. ముంబై నుంచి ఈ ప్రాంతానికి ప్రతి రోజు రైలు సర్వీస్‌ నడిపే విధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని, జాతీయ స్కిల్‌ కేంద్ర ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తరుణ్‌ చుగ్‌ హామీ ఇచ్చారు. 

కమీషన్ల కోసమే కాళేశ్వరం నిర్మాణం : ఎంపీ అర్వింద్‌

కమీషన్ల కోసమే కాళేశ్వర ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ చేపట్టాడని ఎంపీ అర్వింద్‌ ఆరోపిం చారు. నెల రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వానలు పడితే కనీసం వరద బాధితులను పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ కాలు విరిగిందన్న నెపంతో ఇంట్లో సినిమాలు చూ స్తూ కాలం గడుపుతున్నాడని ఎద్దెవా చేశారు. ఎన్‌ఆర్‌ఐ పాలసీని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టేలా కేంద్రం దృష్టికి తీసుకెళతానన్నారు. చెరుకు కర్మాగారాలను తెరిపించేందుకు కృషి చేస్తానన్నారు.  ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, నాయకులు దన్‌ంజయ్‌, పీసరి నర్సయ్య, ఇల్లందుల శ్రీనివాస్‌, సాంబారి ప్రభాకర్‌, పూదరి అరుణ, బోడ్ల రమేష్‌, దోనికల నవీన్‌, సడిగే మహేష్‌, సుదవేణి మహేష్‌, శ్రీనివాస్‌ రావు పాల్గొన్నారు. 

ఫపట్టణంలోని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభా ప్రాంగణం జైశ్రీరాం నినాదంతో మా రు మోగింది. ఎంపీ అర్వింద్‌ మాట్లాడే ముందు జైశ్రీరాం నినాదంతో మొదలు పెట్టడంతో హా జరైన ప్రజలు కూడా పెద్ద ఎత్తున జై శ్రీరాం అంటూ నినాదం చేశారు. 

ఫబహిరంగ సబకు విచ్చేసిన బీజేపీ జాతీయ నాయకుడికు తరుణ్‌ చగ్‌కు జిల్లా, నియో జకవర్గ నాయకులు ఘన స్వాగతం పలికారు. సభా వేదిక వద్దకు వచ్చిన తరణ్‌ చుగ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర ప్రదాణ కార్యధర్శి ప్రేమేందర్‌ రెడ్డి, నిజామాబాదు ఎంపీ ఆర్వింద్‌కు గజమాలతో స్వాగతం నియోజకవర్గ ఇన్‌చార్జి జేఎన్‌ వెంకట్‌, యువనాయకుడు సురభి నవీన్‌లు పలికారు. 

ఫపట్టణంలోని వివిధ వార్డుల నుంచి బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీలను నిర్వహించి సభా స్థ లానికి చేరుకున్నారు. పట్టణంలోని పలు కూడళ్లతో పాటు రోడ్డుకు ఇరువైపుల ప్లెక్సీలను  ఏర్పాటు చేసి స్వాగతం పలికారు. 

ఫబహిరంగ సభకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మెట్‌పల్లి, జగిత్యాల డిఎస్‌ పీ రవీందర్‌ రెడ్డి, ప్రకాష్‌ ఆధ్వర్యంలో 10 మంది సిఐలు, 27 మంది ఎస్‌ఐలు 300 పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తును నిర్వహించారు. సభా ప్రాంగణానికి వచ్చే భారీ కాన్వాయ్‌కి కోరుట్ల సీఐ రాజశేఖర్‌ రాజు, ఎస్‌ఐ సతీష్‌ బందోబస్తు నిర్వహించారు. 



Updated Date - 2022-08-19T06:27:31+05:30 IST