ఖర్చు అధికం.. ‘మద్దతు’ స్వల్పం

ABN , First Publish Date - 2022-06-26T06:11:00+05:30 IST

ఖర్చు అధికం.. ‘మద్దతు’ స్వల్పం

ఖర్చు అధికం.. ‘మద్దతు’ స్వల్పం

ఏటా పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడులు

ఆశించిన స్థాయిలో పెరగని ప్రభుత్వ మద్దతు ధరలు

పంటలు దెబ్బతింటే పెట్టుబడులు రావడమూ కష్టమే

రైతులకు సంక్లిష్టంగా మారుతున్న సాగు

వానాకాలం సాగు మొదలైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి కూడా మద్దతు ధరలు నామమాత్రంగానే పెంచింది. పెట్టుబడులు వేలల్లో పెరుగుతుంటే మద్దతు ధర మాత్రం వందల్లో పెరుగుతోంది. దీంతో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర పెద్దగా లేకపోవడంతో లాభాలు గడించలేకపోతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌లో మద్దతు ధర కన్నా అధికంగా ఉండడంతో రైతులు కాస్త ఆనందంగా ఉన్నారు. కానీ ఒక్కోసారి పంటలు భాగా పండినప్పుడు కనీస మద్దతు కంటే తక్కువ ధరలకు పంటలను అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో రైతులు నష్టపోతున్నారు. కనీస మద్దతు ధర పెరిగితేనే ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వం ఎంఎ్‌సపీకి మార్కెట్‌లో పంటలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఎంఎ్‌సపీ ధరలను దృష్టిలో ఉంచుకుని పంటలు కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన మద్దతు ధరలు విషయంలో రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 

ఖమ్మం, జూన 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఇటీవల ప్రకటించిన ధరల్లో పత్తి సాధారణ రకం గతంలో రూ.5,726 ఉండగా ఇప్పుడు రూ.6,080కు, నాణ్యతరకం గతంలో 6,025ఉండగా రూ.6,380కు పెంచారు. ధాన్యం క్వింటాకు గతంలో కామన రకానికి రూ.1,940ఉండగా కొత్త ధర రూ.2,040పెంచారు అంటే క్వింటాకు రూ.100 పెరిగింది. గ్రేడ్‌ ఏ రకం గతంలో రూ.1,960 ఉండగా ఇప్పుడు రూ.2,060 పెంచారు. అంటే క్వింటాకు రూ.100పెరిగింది. అలాగే జొన్నలు హైబ్రిడ్‌ గతంలో రూ.2738ఉండగా ఇప్పుడు రూ.2970, జొన్నలు సాధారణరకం రూ.2758ఉండగా రూ.2,990కు పెంచారు. సజ్జలు గతంలో రూ.2,250 ఉండగా ఇప్పుడు 2350కు, రాగులు గతంలో రూ.3,377ఉండగా రూ.3,578, మొక్కజొన్న రూ.1870 ఉండగా 1,962కు పెంచారు. మినుములు గతంలో రూ.6300ఉండగా రూ.6,600లకు పెంచారు. పెసలు గతంలో రూ.7,275ఉండగా ఇప్పుడు రూ.7,755పెంచారు. వేరుశనగ గతంలో రూ.5,550ఉండగా రూ.5,850కు, పొద్దుతిరుగడు రూ.6015ఉండగా రూ.6,400పెంచారు. నువ్వులు గతంలో రూ.7,307ఉండగా ఇప్పుడు రూ.7,830కు, సోయాచిక్కుడు గతంలో రూ.3,950 ఉండగా ఇప్పుడు 4,300కు పెంచారు. 


భారీగా పెరుగుతున్న పెట్టుబడి ఖర్చు

ప్రభుత్వ మద్దతు ధరలు క్వింటాకు వందల్లో పెరగగా పెట్టుబడులు మాత్రం గతేడాదితో పోల్చితే భారీగా పెరిగాయి. కూలీలు, దక్కులు, ఎరువులు, పురుగుమందుల ధరలు, విత్తనాలు ధరలు పెరగడంతో రైతులపై అదనపుభారం పడుతోంది. ప్రస్తుతం పత్తికి బహిరంగ మార్కెట్‌లో క్వింటాలుకు రూ.12వేలకు పైనే ధర పలుకుతోంది. మద్దతు ధర మాత్రం సగానికిపైగా ఉంది. జిల్లాలో సుమారు 2లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేస్తున్నారు. పత్తిపంటకు పెట్టుబడి కౌలుతో కలిపి ఎకరానికి రూ.40వేలనుంచి రూ.50వేలకుపైగా పెట్టుబడి అవుతోంది. ప్రకృతి వైపరిత్యాలతో పంట దెబ్బతింటే రైతులు నష్టపోవాల్సిందే.. ప్రస్తుతం పత్తికి ప్రభుత్వ మద్దతు ధర కంటే ప్రైవేటులోనే ధర అధికంగా ఉంది. మద్దతు ధర ఎక్కువ పెంచితే రైతుకు మార్కెట్‌లో సంక్షోభం ఉన్నప్పుడు సీసీఐ ద్వారా కొనుగోలులో లాభాలు పొందే అవకాశం ఉంది. అలాగే మిర్చి వంటి వాణిజ్యపంటలకు కేంద్రం ఇప్పటి వరకు మద్దతు ధర ప్రకటించడం లేదు. ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాల వరకు మిర్చి సాగుచేస్తున్నారు. మిర్చి భారీగా పండినప్పుడు క్వింటాకు రూ.10వేలు తక్కువగా ఉండగా ఉత్పత్తి తగ్గినప్పుడు రూ.20వేల వరకు పలుకుతోంది. మిర్చికి కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్నా ఇప్పటి వరకు మిర్చి పంటకు మద్దతు ధర ప్రకటించడంలేదు దీంతో మిర్చి మార్కెట్‌ జూదంగా మారింది. మిర్చి సాగుచేయాలంటే ఎకరానికి సుమారు రూ.లక్ష పెట్టుబడి అవుతుంది. తామరపురుగు వంటి తెగులు వస్తే తోటలే పనికిరాని పరిస్థితి ఉంది. జిల్లాలో వరి సుమారు 2,95,000 ఎకరాల వరకు సాగువుతోంది. ఎకరానికి రూ.30వేల నుంచి 40వేల వరకు పెట్టుబడి ఖర్చువుతోంది. కనీస మద్దతు ధర తక్కువగా ఉండడం వల్ల రైతులు అనుకున్న లాభాలు పొందలేకపోతున్నారు. తుఫాన్లు ఇతర ప్రకృతిప్రభావాలు ఎదురైనప్పుడు దిగుబడులు తగ్గుతున్నాయి. జిల్లాలో ప్రధాన పంటగా వరి సాగవుతోంది. మద్దతు ధర పెరిగితే రైతులు కూడా లాభాలు చూసే అవకాశ ం ఉంది. వాణిజ్య పంటలతో పోలిస్తే ధాన్యం సాగుచేసే రైతులకు లాభాలు తక్కువగా వస్తున్నాయి. మొక్కజొన్న పంట జిల్లాలో సుమారు ఐదు వేల ఎకరాల వరకు సాగువుతోంది. ప్రస్తుతం ప్రైవేటులో మక్కల ధరలు ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువగానే ఉన్నా అన్ని సమయాల్లో మక్కలకు ఈ ధర లభించడం లేదు. ముఖ్యమంగా పంట చేతికొచ్చేటప్పుడు మక్కల ధరలు భారీగా తగ్గిపోతున్నాయి. ప్రభుత్వం కొనుగోలు చేయనప్పుడు ప్రైవేటు వ్యాపారులకు ధరలకే రైతులు అమ్ముకుంటున్నారు. అలాగే కంది, పెసర, మినుము తదితర పంటల పరిస్థితి కూడా  ఇలాగే ఉంది. డీజిల్‌ ధరలు పెరగడం వల్ల ఈ ప్రభావం అన్నీ రంగాలపై పడింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధరను ఎక్కువగా పెంచితేనే రైతులకు సాగు లాభాదాయంకంగా మారుతుంది. 

Updated Date - 2022-06-26T06:11:00+05:30 IST