పత్తి బస్తాల్లో రేషన్‌ బియ్యం

ABN , First Publish Date - 2020-12-03T04:46:08+05:30 IST

cottenనగరంలోని వ్యవసాయ మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన పత్తి బస్తాలలో రేషన్‌ బియ్యం లభ్యమయ్యాయి.

పత్తి బస్తాల్లో రేషన్‌ బియ్యం
పత్తి బస్తాలలో ఉన్న రేషన్‌ బియ్యం

ఖమ్మం మార్కెట్‌, డిసెంబరు2: నగరంలోని వ్యవసాయ మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన పత్తి బస్తాలలో రేషన్‌ బియ్యం లభ్యమయ్యాయి. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారేపల్లి మండలాలనికి చెందిన ఓ రైతు మంగళవారం 8పత్తి బస్తాలను అమ్మకానికి మార్కెట్‌కు తీసుకొచ్చాడు. ట్రేడర్‌కు పత్తి నాణ్యత చూపించే క్రమంలో బస్తాను సదరు కమీషన్‌ దారుడికి చెందిన హమాలీ బస్తాను కట్‌ చేసి చూపించగా బస్తా మద్యలో బియ్యం ఉండటాన్ని గమనించారు. అనంతరం అనుమానం వచ్చి మిగితా ఏడుబస్తాలను పరిశీలించగా వాటిలో సైతం బియ్యం ఉన్నాయి. సదరు వ్యాపారులు ఖంగుతిన్నారు. కాంటాలలో ఎక్కువ తూకం రావడం కోసం ఒక్కో బస్తాలో సుమారు 5 కేజీల రేషన్‌ బియ్యాన్ని మొత్తం 40 కేజీల బియ్యాన్ని రైతే కావాలని కలిపాడని నిర్ధారణకు వచ్చారు. ఆయా పత్తి బస్తాలను అమ్మకానికి తెచ్చిన రైతు కోసం ఆరా తీయగా సదరు రైతు తమ గ్రామానికి చెందిన ఇతర రైతులతో పంటను అమ్మకానికి పంపించడంతో వ్యాపారులు, హమాలీలు ఆశ్చర్యానికి గురయ్యాడు. రైతులు ఇలాంటి పనులు చేయకూడదని గిట్టుబాటు ధర కోసం పోరాడాలని సూచించారు.


Updated Date - 2020-12-03T04:46:08+05:30 IST