పత్తిలో సరికొత్త ప్రయోగం

ABN , First Publish Date - 2022-06-20T05:26:40+05:30 IST

సంప్రదాయ పద్ధతికి భిన్నంగా చేనులో అధి క సాంద్రతతో పత్తిని పండించ డానికి రైతులను వ్యవ సాయాధికారులు సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు కొత్త పద్ధతిలో పత్తి పండిస్తుండగా, ఈసారి సాగు విస్తీర్ణాన్ని పెంచనున్నారు.

పత్తిలో సరికొత్త ప్రయోగం

 పత్తి సాగులో ప్రయోగాలకు శ్రీకారం 

 తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు  

 ఒకేసారి పత్తి సేకరణతో లాభాలు 

 పెట్టుబడి వ్యయం తగ్గి, అధిక దిగుబడులకు అవకాశం


వర్ధన్నపేట, జూన్‌ 19 :  జిల్లాలో వరి తర్వాత పత్తి ప్రధాన పంట. ఖరీఫ్‌ సీజన్‌లో ఏటా పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఇదే క్రమంలో ప్రతికూల వాతా వరణం, తెగుళ్లు, చీడపీడలతో పెట్టుబడి పెరిగి, పంట దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టాల పాలవుతున్నారు. ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడడానికి ఈసారి పత్తిలో వినూత్న ప్రయోగానికి ప్రయత్నాలు జరుగు తున్నాయి. సంప్రదాయ పద్ధతికి భిన్నంగా చేనులో అధి క సాంద్రతతో పత్తిని పండించ డానికి రైతులను వ్యవ సాయాధికారులు సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు కొత్త పద్ధతిలో పత్తి పండిస్తుండగా, ఈసారి సాగు విస్తీర్ణాన్ని పెంచనున్నారు.

 కొత్త సాగు ఇలా..

సంప్రదాయ పద్ధతి కాకుండా అత్యల్ప విస్తీర్ణంలో అధిక సంఖ్యలో విత్తనాలు నాటి, పంట మొత్తాన్ని ఒకేసారి ఏరుకునేలా కొత్త విధానం అందుబాటు లోకి వచ్చింది. ఇప్ప టి వరకు అవలంబి స్తున్న విధానంలో ఎ కరానికి  వేయి నుంచి 8వేల పత్తి మొక్కలు ఉం టే, అధిక సాంద్రత పద్ధతిలో సమారు 25వేల మొక్కలు ఉండే అవకాశం ఉంది. సంప్ర దాయ పద్ధతిలో వరుసల మధ్య దూరాన్ని 60 నుంచి 90సెంటీమీటర్లు ఉంచే వారు కొత్త విధానంలో కేవలం 10 నుంచి 20 సెంటీ మీటర్లుగా చేయ డం, మీటరు పొడవుకి 8 నుంచి 10 మొ క్కలు వచ్చే లా పంట సాంద్రతను పెంచుకోవడం జరుగు తోంది. ఈ విధానంతో అధిక ది గుబడులు సాధించడానికి అవ కాశాలు మెండుగా ఉంటాయి. 

అనువైన రకాలు..

అధిక సాంద్రత పద్ధతిలో సాగు కు అనువైన రకాలను వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇం దులో ప్రధానంగా ఏబీడీ-39, ఎన్‌ీ సఎస్‌-277 ముఖ్యమైన వి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న వివిధ రకాలైన ప్రైవే టు హైబ్రిడ్‌ విత్తనాలను (విన్నర్‌, సిరి, సూరత్‌, రాజత్‌ పీవీకే-081) రకాలను నూతన యాజ మాన్య పద్ధతులు ఉపయోగించి విత్తుకోవచ్చని చెబుతున్నారు.

 అధిక ధరలతో సాగు విస్తరణ.. 

వ్యవసాయ శాఖ గత సంవత్సరం పంటలు సాగు చేసే వాటిపై అంచనా వేయగా 1,09,601 ఎకరాల్లో సా గు చేసినట్లు, ఈ సంవత్సరం 1,21,000 ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ ప్రణా ళిక రచించింది. ఇంతకన్నా ఎక్కువ సాగయ్యే అవ కా శం ఉందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తు న్నా రు. ఏటా పత్తి ధర రూ.6వేల నుంచి రూ.7వేల వరకు ఉండగా, ఈ ఏడు క్వింటా రూ.13వేల వరకు ధర పలికింది. దీంతో ఈసారి పత్తి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు ప్రపంచంలో పత్తికి అధిక డిమాండ్‌ ఉండడంతో ధరలు అధిక మొత్తంలో ఉంటాయని భావిస్తున్నారు. పప్పు ధాన్యాలు సరిగ్గా దిగుబడి రాకపోవడం, కూలీల కొరత ఉండడం, చీడపీడలు అధిక మొత్తంలో ఆశీంచడంతో వాటిపై అనాసక్తి కనబరుస్తున్నారు. 

ఒకేసారి ఏరడం ఎంతో సులువు..

పంట చేతికి వచ్చిన తర్వాత 2 నుంచి 3 సార్లు పత్తి ఏరడం జరుగుతుంది. ఇందుకు కూలీల అవసరం ఎంతగానో ఉంటుంది. పత్తి సేకరించే క్రమంలో అకాల వర్షాలు వస్తే పంట నష్టం అధికంగా ఉంటుంది. కానీ, అధిక సాంద్రతలో పత్తిపంట మొత్తాన్ని ఒకేసారి సేకరించుకోవచ్చు. ఇందుకు కూలీల అవసరం తగ్గి, పంట కోసం అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. అలాగే, ఈ విధానంతో రెండో పంటగా పప్పుధాన్యాలు, ఆరుతడి పంటలు వేసుకోవడానికి అనుకూలత ఏర్పడు తుంది. అధిక సాంద్రతతో పత్తి సాగుతో వల్ల ఎకరానికి 7 నుంచి క్వింటా పత్తి పండే అవకాశాలు ఉన్నాయి. 

 యాజమాన్య పద్ధతులు..

పంట మొత్తం ఒకేసారి చేతికి రావడానికి మేపిక్వా ట్‌ క్లోరైడ్‌ అనే రసాయనాన్ని పత్తి విత్తుకున్న 40 నుంచి 60 రోజుల్లో ఒకసారి, 70 నుంచి 80 రోజుల్లో మరోసారి పిచికారీ చేయాలి. పూతదశలో లీటరు నీటికి 1.5 మి.లీ రసాయాన్ని వినియోగించాలి. కాయదశలో లీటరు నీటికి 2 మి.లీ రసాయాన్ని మరోసారి వినియో గించాలి. ఇలాచేయడం వలన పంట సరళిని ఒకేసారి ఏరుకోవడానికి వీలుంటుంది. తద్వారా అధిక దిగుబడి సాధించవచ్చు. ఒకేసారి పంట చేతికి అందడం వల్ల నవంబర్‌లేదా డిసెంబరులో పత్తిని  సేకరించుకోవచ్చు. 


కొత్త పద్ధతిలో సాగు చేయాలి

రాంనర్సయ్య, ఏవో వర్ధన్నపేట 

అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేస్తే, అధిక దిగుబడి సాధించడంతో పాటు ఒకేసారి పంట చేతికి రావడంతో కూలీల కొరత లేకపోవడంతో పాటు రెండో పంటగా ఆరుతడి పంటలు సాగుచేసే అవకాశం ఉంటుంది. 


Updated Date - 2022-06-20T05:26:40+05:30 IST