పత్తి రైతు కుదేలు

ABN , First Publish Date - 2021-10-27T05:18:12+05:30 IST

పాలమూరు ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది పత్తిరైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది.

పత్తి రైతు కుదేలు
మిడ్జిల్‌ మండలంలో సాగు చేసిన పత్తిపైరు

- వర్షాభావం ఆపై అధికవర్షాలు

- నిండామునిగిన పత్తి రైతు

- భారీగా పడిపోయిన దిగుబడి

- ధర ఉన్నా దక్కని ఫలితం

- ఎకరాకు సగటున రూ.20వేల నష్టం  

- పూర్తిగా దెబ్బతిన్న కౌలురైతులు

- ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు


 అధికవర్షాలతో పాలమూరు ఉమ్మడి జిల్లా పత్తిరైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. మొదట వర్షాభావంతో పైరు ఎదగకపోవడం, ఆ తర్వాత  అధికవర్షాలతో తెగుళ్లు వ్యాపించ డంతో రైతు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.  పంటను రక్షించుకునేందుకు రైతు పురుగుల మందులు, ఎరువులు అధికంగా పెట్టినా పైరుకు వయస్సు పెరగడంతో  ఆశించిన స్థాయి లో పైరు కోలుకోలేదు. దీంతో పెట్టుబడి పెరిగింది కానీ దిగుబడి మాత్రం పెరగకపోవడం తో రైతులు మరింత నష్టపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా  పంటనష్టం ఎక్కువగా జరిగిం ది. పత్తి క్వింటాల్‌కు ధర రూ.7 వేల వరకు వస్తున్నా దిగబడిలేక రైతులకు ప్రయోజనం లేని పరిస్థితి  నెలకొన్నది.

 (మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి) 

 పాలమూరు ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది పత్తిరైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. తొలుత వర్షాభా వ పరిస్థితులు, ఆపై అధికవర్షాలు పత్తి రైతుని నిలువు నా ముంచేశాయి. వర్షాభావ సమయంలో పైరు ఎదగక పోవడం, ఆ తర్వాత  అధికవర్షాలతో ఎదిగిన పైరు  పూ త, పిందెరాలిపోవడం, పైరు ఎర్రబారి పోవడంతో దిగుబ డి పూర్తిగా తగ్గిపోయింది. ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో దాదాపు 23 రోజుల పాటు వానలు కురవడంతో  పత్తి పంటకు తీవ్రనష్టం వచ్చింది. తేమ వాతావరణం ఎక్కు వగా ఉండడంతో తెగుళ్లు వ్యాపించాయి. తెగుళ్ల నివారణ కు, పైరు ఎదుగుదలకు, పూత, పిందె వచ్చేందుకు వెర వకుండా మందులు వేయడంతో పెట్టుబడి సైతం గణనీ యంగా పెరిగింది. దీంతో పెట్టుబడులు పెరిగినా పైరు వయసు ముదరడంతో ఆశించినస్థాయిలో పూత, పిందె రాకపోవడం, తెగుళ్లు అదుపు కాలేదు. దీంతో పత్తి దిగుబ డి పూర్తిగా తగ్గిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాగ ర్‌కర్నూల్‌, కల్వకుర్తి, అచ్చంపేట, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, అలంపూర్‌, గద్వాల డివిజన్లలో పంట న ష్టం ఎక్కువగా జరిగింది. ఒకవైపు పత్తి క్వింటాల్‌కు ధర రూ.7వేల వరకు వస్తున్నది. దిగబడి లేకపోవడంతో  రై తులకు  ప్రయోజనం లేని పరిస్థితి నెలకొంది.

 ప్రకృతి దెబ్బకు భారీ నష్టం

 ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో పత్తి రైతులపై ప్రకృతి కన్నెర్రజేయడంతో భారీ నష్టం చవిచూడాల్సి వచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా  అధికవర్షాలతో చీడపీడల బెడ ద అధికమవడంతో పెట్టుబడి గనణీయంగా పెరిగింది. దిగుబడి పూర్తిగా  తగ్గిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా ఈ ఏడాది 8.11 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సుమారు 70లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని  అధికా రులు అంచనావేశారు.  ప్రకృతి ప్రకోపంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ఇప్పుడు మొత్తం అంచ నాలో మూడోవంతు అంటే సుమారు 22 లక్షల క్వింటాళ్ల కు మించి పత్తి దిగుబడి ఉండదని స్పష్టమవుతోంది.   మొత్తంగా పత్తి సాగుచేసిన  రైతులు ఎకరాకు కనీసంగా రూ.15వేల నుంచి రూ.20వేల వరకు నష్టపోయామని వాపోతున్నారు. కౌలురైతులు మాత్రం నిండా మునిగామ ని, కౌలుతో పాటు, పెట్టుబడి నష్టం వచ్చిందని వాపోతు న్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే వ్యవసాయాధికారు లు మాత్రం ఎక్కడా పంటలకు నష్టం వాటిల్లలేదని, 10 నుంచి 14శాతమే నష్టం వచ్చిందని నివేదికలివ్వడంపై రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పరిశీలించి నష్టపోయిన పత్తి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.  



Updated Date - 2021-10-27T05:18:12+05:30 IST