ఇది నూతన వ్యాక్సినేషన్. అందుకే తెలియని ఆందోళన కలిగింది. దీంతో రాత్రంతా పడుకోలేకపోయాను. భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను. కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్ డైరెక్టర్ డాక్టర్ జీ గురురాజ్ కు ఇచ్చాను. ఈ ఇంజక్షన్ ఇస్తున్నప్పుడు చేతులు వణుకుతున్నట్లు అనిపించింది. తరువాత మనసును స్థిమితపరచుకుంటూ, ధైర్యంగా వ్యవహరించాను. ఈ సమయంలో కొలీగ్స్ సాయం చేశారు. దీంతో ఇంజక్షన్లు ఇచ్చాను. వ్యాక్సిన్ షాట్ ఇచ్చే సమయంలో గతంలో ఆసుపత్రికి వచ్చిన కరోనా కేసులు గుర్తుకువచ్చాయి. ఆసుపత్రి సిబ్బందికి కూడా కరోనా సోకింది. ఎన్నో మరణాలు కూడా చూశానని జోసిమా తెలిపారు. కాగా ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్లో జోసిమా మొత్తం 38 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు.