ఇంజనీరింగ్‌కు.. వెబ్‌ ఆప్షన్ల

ABN , First Publish Date - 2021-11-01T05:40:14+05:30 IST

ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి కీలకఘట్టమైన వెబ్‌ ఆప్షన్ల ఎంపిక సోమవారం నుంచి ప్రారంభం కానుంది.

ఇంజనీరింగ్‌కు.. వెబ్‌ ఆప్షన్ల
కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు(పాతచిత్రం)

ఇంజనీరింగ్‌కు.. వెబ్‌ ఆప్షన్ల

నేటి నుంచే 5వ తేదీ వరకు అవకాశం 

అప్రమత్తంగా ఉండాలని అధ్యాపకుల సూచన


గుంటూరు(విద్య), అక్టోబరు 31: ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి కీలకఘట్టమైన వెబ్‌ ఆప్షన్ల ఎంపిక సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల పరిశీన పూర్తైంది. ఈ క్రమంలో కళాశాలలు, బ్రాంచ్‌ల ఎంపికకు సంబంధించి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియకు ఉన్నత విద్యా మండలి 5వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఆప్షన్‌ మార్చుకునే అవకాశం నవంబరు 6వ తేదీన కల్పించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, నరసరావుపేటలోని జేఎన్‌టీయూ కళాశాల, నల్లపాడులోని ఎంబీటీఎస్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.  విద్యార్థులకు నవంబరు 10న సీట్లు కేటాయిస్తారు. జిల్లాలో దాదాపు 38 కళాశాలలు ఉండగా అందులో 18 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. కళాశాల, బ్రాంచీల ఎంపిక విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అధ్యాపకులు సూచిస్తున్నారు. కళాశాల ఎంపిక విషయంలో ఆ కళాశాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటున్నారు. వీలైతే పూర్వవిద్యార్థుల ద్వారా సమాచారం సేకరించి ఆప్షను ఇచ్చుకోవాలంటున్నారు. ప్లేస్‌మెంట్స్‌, క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించిన కంపెనీల వివరాలు తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రస్తుతం ఎంపిక చేసుకునే బ్రాంచ్‌కు నాలుగేళ్ల తర్వాత  ఎలాంటి భవిష్యత్‌ ఉండబోతుందనే విషయంపై కూడా విద్యార్థికి అంచనా ఉండాలి. అపరిచితులకు పాస్‌వర్డ్‌ ఇతర వివరాలు అసలు ఇవ్వవద్దని అధ్యాపకులు సూచిస్తున్నారు.   

  

 

Updated Date - 2021-11-01T05:40:14+05:30 IST