హైదరాబాద్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): అండర్ గ్రాడ్యుయేషన్ ఆయుష్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మాప్ అప్ విడత వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం విడుదల చేసింది. హోమియోపతి(బీహెచ్ఎంఎస్), ఆయుర్వేద(బీఏఎంఎస్), నేచురోపతి-యోగా(బీఎన్వైసీ), యునానీ (బీయూఎంఎస్) కోర్సుల్లో ఖాళీ సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.