నిజామాబాద్ అర్బన్, జనవరి 23: ఈనెల 25న జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఎస్.ఎ (హిందీ), ఎస్.జి.టి. (ఇంగ్లీష్ మీడియం) అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీఈవో దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్.ఎ (హింది) 8, ఎస్.జి.టి. (ఇంగ్లీష్ మీడియం) ఒక పోస్టుకు కౌన్సెలింగ్ నిర్వహించి అనంతరం నియామక ఉత్తర్వులు అందజేస్తామన్నారు.