కౌన్సెలింగ్ ఇస్తున్న ఎన్‌ఆర్‌ఐ క్లినికల్ సైకాలజిస్ట్
తగరపువలస, మే 16: భీమిలి పోలీస్ స్టేషన్‌లోని ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లకు సోమవారం సంగివలస ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలోని సైకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రేఖాదత్ ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ కమిషనర్ సూచనలతో భీమిలి సీఐ జి.వెంకటరమణ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ దత్ ఒక్కొక్కరిని గదిలోకి పిలిచి వారి వివరాలను తెలుసుకున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి వారికి సలహాలు, సూచనలు అందించారు. ఉదయం యోగా చేయాలని, మెడిటేషన్ చేయాలని కొందరికి సూచించారు. ఈ కార్యక్రమం వల్ల ఎంతో ప్రయోజనం కలిగిందని, చాలా మంది పోలీసులు రిలీఫ్ అయ్యారని సీఐ చెప్పారు.